Janasena Finalized Candidates for 18 Seats: ఎన్డీయే కూటమితో పొత్తులో భాగంగా రాష్ట్రంలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన, తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొదట్లో ఐదుగురి పేర్లను ప్రకటించిన జనసేన ఆ తర్వాత నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పేరుని వెల్లడించింది. అనంతరం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా జాబితాలో 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. దీంతో మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లైంది.
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి బరిలో సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలులో దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు.
అదే విధంగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరంలో చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరులో డా.యనమల భాస్కరరావు పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంటుకు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితమే పవన్ ప్రకటించారు. తాజా జాబితాలో ఆయను పేరుని అధికారికంగా వెల్లడించారు. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలో 4, కోస్తాలో 12, రాయలసీమలో 2 సీట్లలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు.
ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్ - Pawan Kalyan on Veera Mahilalu
మిగిలిన స్థానాలకు గట్టిపోటీ: మచిలీపట్నం లోక్‌సభతో పాటు మరో 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి అభ్యర్థి అయ్యే అవకాశముంది. ఆయితే ఆయన పేరును అవనిగడ్డ అసెంబ్లీకి కూడా పరిశీలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తే అవనిగడ్డ అసెంబ్లీ కేటాయిస్తారని సమాచారం. ఈ స్థానానికి జనసేనలోనే గట్టిపోటీ ఉంది. బండ్రెడ్డి రామకృష్ణ, చిలకలపూడి పాపారావుతో పాటు ఓ ప్రవాసాంధ్రుడు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. విశాఖపట్నం దక్షిణ స్థానం కోసం కూడా జనసేనలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు.
చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైంది. ఆయనకు ఇప్పటికే వ్యక్తిగతంగా చెప్పి ఎన్నికల నియమావళి పత్రాలను అందజేశారు. అక్కడున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పి.గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి తొలుత తెలుగుదేశం అభ్యర్థిగా మహాసేన రాజేశ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే, పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఆరణి శ్రీనివాసులు పోటీచేస్తారని పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు. స్థానిక పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం నాయకులూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన్నే కొనసాగించాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించింది.
ఆచితూచి వ్యవహరించిన పవన్ కల్యాణ్: పొత్తులో భాగంగా మొదట జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని భావించినప్పటికీ భాజపాకు 3 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. సామాజిక సమీకరణాలతో పాటు వైకాపా అభ్యర్థులని గట్టిగా ఢీకొట్టే సత్తా ఉన్నవారిని ఎంపిక చేశారు. అన్ని స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో సీట్ల విషయంలో పట్టింపులకు పోకుండా పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరించారు.
పవన్ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము: వర్మ - SVSN Verma met Pawan Kalyan