Jagtial BRS MLA Sanjay Kumar Joins Congress : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ముఖ్యమైన నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
BRS MLAs Join Congress Party : సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరినట్లు అయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి - GUTHA AMIT REDDY JOINS CONGRESS
MLAs join Congress party from BRS : మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందులో హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
PCC Comments on BRS Leaders Joinings : బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి 26 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాల్సి ఉందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం అంతర్గతంగా వేగవంతంగా కొనసాగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ ముఖ్య నాయకులు వారితో సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించేందుకు కొంతమంది ముఖ్యులు అంతర్గతంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.