ETV Bharat / politics

హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ - Hyderabad BRS MP Candidate

Hyderabad Lok Sabha BRS Candidate 2024 : హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లైంది.

Hyderabad Lok Sabha BRS Candidate 2024
Hyderabad Lok Sabha BRS Candidate 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 12:00 PM IST

Updated : Mar 25, 2024, 12:37 PM IST

Hyderabad Lok Sabha BRS Candidate 2024 : తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 16 స్థానాలది ఒక రూట్, హైదరాబాద్ స్థానం రూట్ మాత్రం సపరేటు. మిగిలిన స్థానాల్లో పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటిస్తుంటే, హైదరాబాద్ స్థానం విషయంలో మాత్రం కాస్త తటపటాయిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడి నుంచి ఎవరు బరిలో నిలిచినా గెలుపు మాత్రం ఎంఐఎం అభ్యర్థిదే కావడం. ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మల్లగుల్లాలు పడుతున్నాయి.

అయితే ఎట్టకేలకు హైదరాబాద్ లోక్ సభ స్థానానికి కూడా భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి (Hyderabad Lok Sabha Polls 2024) ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాద్ నుంచి పార్లమెంట్ బరిలో దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించారు.

BRS Lok Sabha Candidates List 2024 : లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. 17 స్థానాలకు గాను మూడు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు, మిగిలిన 12 స్థానాల్లో సగం స్థానాలు అంటే ఆరింటిని బీసీలకు కేటాయించారు. చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, నిజామాబాద్ లోక్ సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇందులో ఇద్దరు మున్నూరు కాపు, ఇద్దరు యాదవ, ఒకరు ముదిరాజ్, ఒకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.

ఇక బీఆర్ఎస్ ప్రకటించిన 17 అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఉండగా ఏడుగురు కొత్త వాళ్లకు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ 17 మందిలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ (RS Praveen Kumar Joined BRS)లు ఉన్నారు.

Lok Sabha Ticket For BRS Sitting MPs : సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులైన ఖమ్మం - ఎంపీ నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ - మాలోతు కవిత, మహబూబ్‌నగర్ ఎంపీ - మన్నె శ్రీనివాస్ రెడ్డిలకే కేసీఆర్ మరోసారి పట్టం కట్టారు. ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ (Secunderabad BRS MP Candidate)కు సికింద్రాబాద్ సీటు ఇచ్చారు. ఇక మెదక్ ఎంపీ సీటును ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డికి కేటాయించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో నిలవగా, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆత్రం సక్కు నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ నుంచి పోటీలో నిలుస్తున్నారు.

ఇక చేవెళ్ల టికెట్‌ను మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ను బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చారు. జహీరాబాద్, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండ, హైదరాబాద్‌ టికెట్లను కొత్త వాళ్లకు కేటాయించారు. ఇందులో జహీరాబాద్-అనిల్ కుమార్, వరంగల్ - కడియం కావ్య, మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి, భువనగిరి-క్యామ మల్లేశ్, నల్గొండ-కంచర్ల కృష్ణారెడ్డి, హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ల పేర్లు ఖరారు చేశారు.

సికింద్రాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate

నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - BRS MP Candidates List 2024

Last Updated : Mar 25, 2024, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.