High Court Hearing on YS Jagan Petition to Visit London: లండన్ వెళ్లేందుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం గతంలో లేఖ రాసిందని సదరు కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని చెప్పినట్లు పిటీషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్ఓసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ జగన్ పిటీషన్ దాఖలు చేశారు.
పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లండన్ టూర్ వెళ్లేందుకు పిటీషనర్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజా ప్రతినిధుల కోర్టు అనేక షరతులను విధించినట్టు పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయటం సరికాదని కోర్టులో జగన్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 3 నుంచి 25వ తేదీ వరకు వైఎస్ జగన్ లండన్‌కు వెళ్లాల్సి ఉంది.