ETV Bharat / politics

నాలుగున్నర నెలల కాంగ్రెస్​ పాలన మొత్తం తిట్లు - దేవుడి మీద ఒట్లతోనే సరిపోయింది : హరీశ్​రావు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Harish Rao Shocking Comments on CM Revanth Reddy : కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర నెలల పాలన మొత్తం తిట్లు, దేవుడి మీద ఒట్లతోనే సరిపోయిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. ఖమ్మం వస్తే రాముల వారిపై, మెదక్ వెళ్తే ఏడుపాయల అమ్మవారిపై, మహబూబ్​నగర్ వెళ్తే జోగులాంబ అమ్మవారిపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Harish Rao Comments on Khammam Development
Harish Rao Shocking Comments
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 8:02 PM IST

Harish Rao Shocking Comments on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్​రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. రూ.2 లక్షల రుణమాఫీపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా, హరీశ్​రావు సీఎంకు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, మళ్లీ పోటీ కూడా చేయబోనని ఛాలెంజ్​ చేశారు. ఒకవేళ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాణం చేసేందుకు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అమల వీరుల స్థూపం దగ్గరకు రావాలన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మెదక్ సీటు మాదే - రెండో స్థానం కోసం హస్తం, కమలం పోటీపడుతున్నాయి : హరీశ్​రావు - Harish Rao Comments on Congress BJP

Harish Rao on Rythu Runamafi in Telangana : ఈ సందర్భంగా నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలన మొత్తం తిట్లు, దేవుడి మీద ఒట్లతోనే సరిపోతుందని హరీశ్​రావు అన్నారు. ఖమ్మం వస్తే రాములవారిపై, మెదక్ వెళ్తే ఏడుపాయల అమ్మవారు, మహబూబ్​నగర్ వెళ్తే జోగులాంబ అమ్మవారిపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టినా, పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిని జిల్లాకు చెందిన మంత్రులు గాలికి వదిలేశారని విమర్శించారు.

"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసగించారు. హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణానికి రావాలి. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న హస్తం పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు." - హరీశ్​రావు, మాజీ మంత్రి

నామినేషన్​ ఒక్కరోజులో గడుస్తున్నా అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్​ ఉంది హరీశ్​రావు

Harish Rao Comments on Khammam Development : ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీరు లేక, రైతులకు సాగు నీరందక, నాణ్యమైన కరెంటు సరఫరా అందక కష్టాలు పడుతున్నారని హరీశ్​రావు అన్నారు. మంత్రులు మాత్రం తమ కుటుంబ సభ్యులకు టికెట్ల కోసం దిల్లీ, బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారన్నారు. ఒక్కరోజుతో నామినేషన్ల గడువు ముగుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థిపైనే ఏకాభిప్రాయం లేని నాయకులు, జిల్లా ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. పూటకో పేరు, రోజుకో పేరు, జిల్లాతో సంబంధం లేనోళ్ల పేర్లు తెరపైకి వస్తుందంటే, కాంగ్రెస్ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్​కుమార్​ పాల్గొన్నారు.

ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు - HARISH RAO CHALLENGES CM REVANTH

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్​ఎస్​ను రద్దు చేస్తారా? - హరీశ్‌రావుకు సీఎం రేవంత్​ రెడ్డి సవాల్ - CM Revanth Reddy Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.