ETV Bharat / politics

ప్రాజెక్టులపై దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేందుకు మేం రెడీ - అసెంబ్లీ ఎప్పుడు పెడతారో చెప్పండి : హరీశ్​రావు - BRS Cadre Meeting in LB Nagar

Harish Rao On Congress About KRMB Projects : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై శాసనసభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెడతారో పెట్టండని కాంగ్రెస్​ పార్టీకి సవాల్ విసిరారు. ఎల్బీనగర్​లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

Harish Rao Comments on Congress Govt
Harish Rao On Congress About KRMB Projects
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 7:58 PM IST

Updated : Feb 5, 2024, 6:35 AM IST

Harish Rao On Congress About KRMB Projects : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై శాసనసభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెడతారో పెట్టండని అధికార కాంగ్రెస్​ పార్టీకి ఆయన సవాల్ విసిరారు. అసెంబ్లీలో దిమ్మతిరిగే సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్​లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హరీశ్​రావు హాజరై, పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Election) కార్యకర్తలు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

కాంగ్రెస్ పార్టీని ఆగం చేసే ఉద్దేశం మాకు లేదు : కేటీఆర్

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో తామెన్నడూ ఒప్పుకోలేదని హరీశ్​రావు తెలియజేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) నీటి పంపకాలకు సంబంధించి అనేక షరతులు పెట్టినట్లు వివరించారు. రేవంత్​ సర్కార్​ మాత్రం వచ్చిన రెండు నెలలకే, కేంద్రం ఒత్తిడి చేయడంతో రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి, అప్పగింతకు ఒప్పుకున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి అడిగే హక్కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదన్నారు.

Harish Rao React on CM Revanth Comments : టీడీపీలో రేవంత్​ రెడ్డి ఉన్నప్పుడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని స్తంభింపజేసి పోరాడింది తామేనని, నాడు మంత్రులుగా ఉన్న తాను, నాయిని నర్సింహారెడ్డి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలియజేశామని గుర్తు చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగితే, దిమ్మతిరిగే జవాబు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అసలు విభజన చట్టం బిల్లు(Partition Act Bill) పెట్టింది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు.

"పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఏరోజు కూడా, కేంద్రం ఎంత ఒత్తిడి పెట్టినా కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ రెండు నెలల కాలంలోనే రేవంత్ సర్కార్​, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రానికి ప్రాజెక్టులన్నీ అప్పగించి సంతకాలు చేశారు. ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో చర్చ పెడతామని సీఎం అంటున్నారు. మేము దానికి సిద్ధం, మీకు దిమ్మతిరిగేలా సమాధానమిస్తాం."-హరీశ్​రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రాజెక్టులపై దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేందుకు మేం రెడీ - అసెంబ్లీ ఎప్పుడు పెడతారో చెప్పండి : హరీశ్​రావు

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

ఆ చట్టం తయారు చేసింది జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్‌ కాదా? తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. హామీలు అమలు(Schemes Implementation) చేయలేక తమపై విరుచుకుపడుతున్నారని హరీశ్​రావు అన్నారు. రేవంత్‌ రెడ్డి విషయం లేక విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు, మూడు గంటలు కరెంట్‌ పోతోందని, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక కరెంటు కోతలు మరింత ఎక్కువవుతాయని జోస్యం చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేశాకే ఓటు అడగాలని హరీశ్‌రావు అన్నారు.

Jagadeesh Reddy Reaction on CM Revanth Comments : కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే సీఎం రేవంత్ కేసీఆర్​పై ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్(KCR) మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తామే నిలదీస్తామని, ఎవరు ద్రోహులు తేల్చుకుందామని సవాలు చేశారు.

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

Last Updated : Feb 5, 2024, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.