ETV Bharat / politics

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసింది : హరీశ్‌ రావు - Harish Rao Comments Congress Govt - HARISH RAO COMMENTS CONGRESS GOVT

Harish Rao Campaign in Nalgonda By Election : కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మోసాన్ని బలపర్చడమేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగుల అందరిని మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే డీఏ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు.

Harish Rao Fire on Congress Govt
Harish Rao Comments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 3:24 PM IST

Harish Rao Campaign in Nalgonda By Election : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. నాలుగో డీఏ కూడా పెండింగులో ఉందని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్‌ చేయడాన్ని బీఆర్ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గ్రాడ్యుయేట్‌ ఉపఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Harish Rao MLC By Election : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బడి పంతుళ్లపై లాఠీఛార్జ్‌లు చేయడం బీఆర్ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందని హరీశ్‌ రావు అన్నారు. గతంలో ఉపాధ్యాయులపై ఇలాంటి జరిగిన ఘటనలు లేవని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ నిరుద్యోగులు, ఉద్యోగుల అందరిని మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు వంద రోజుల లోపల రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పిందని, ఇప్పటివరకు ఏ ఒక్క ఇవ్వలేదని మండిపడ్డారు. అమ్మాయిలకు ఉచిత స్కూటీ ఇస్తామన్నారని ఇవ్వలేదని పేర్కొన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి భ్రమలు వదిలేసి పాలనపై దృష్టి పెడితే మంచిది : హరీశ్​ రావు - Harish Rao tweet on Employee

Harish Rao Comments on Congress : నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇవ్వలేదని హరీశ్‌ రావు మండిపడ్డారు. ఈ విషయంలో అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని గుర్తు చేశారు. రిటైరైన ఉద్యోగులకు పింఛన్ బెనిఫిట్లను మూడు నెలలుగా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రశ్నించే గొంతు అయిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్‌ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మోసం చేసిన కాంగ్రెస్‌కి గుణపాఠం చెప్పాలని అన్నారు.

"రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే పీఆర్సీ కోసం, నిరుద్యోగ సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరాడుతారు. కాంగ్రెస్‌కు ఎన్నికల క్షేత్రంలో శిక్ష తప్పదు. హస్తం గుర్తుకు ఓటేయడమంటే ఆ పార్టీ అబద్ధాలను, మోసాలను ఆమోదించడమే. బీజేపీ కూడా ప్రజలను మోసం చేస్తోంది. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వలేదు." - హరీశ్‌ రావు, మాజీ మంత్రి

రాష్ట్రం గొంతెండిపోతోంది - నీళ్ల కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు : హరీశ్‌ రావు - Harish Rao on Drinking Water

'తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరం' - Harish Rao on Congress Government

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.