ETV Bharat / politics

నామినేటెడ్ పదవుల నజరానా - అంకితభావం, విధేయతలకు పెద్దపీట - AP Nominated Posts 2024 - AP NOMINATED POSTS 2024

AP Nominated Posts 2024: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. నియామకాల్లో అంకితభావం, విధేయతలకు పెద్దపీట వేసింది. పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం కల్పించింది. అదే సమయంలో మిత్రపక్షాలు జనసేన, బీజేపీ నేతలకూ పదవులు కేటాయించింది.

AP Nominated Posts 2024
AP Nominated Posts 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 8:59 AM IST

AP Nominated Posts 2024 : ప్రభుత్వం ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్‌ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్‌లతో పాటు ఆర్టీసీకి వైస్‌ఛైర్మన్‌ను కూడా నియమించింది. వీటిలో ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది.

రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే, ఈ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పోస్టు టీడీపీకు దక్కింది. ఇది తొలి విడత మాత్రమే. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్‌ పోస్టులు, వివిధ దేవాలయాలకు పాలకమండళ్లను ప్రకటించాల్సి ఉంది. వాటికీ ప్రస్తుత విధానంలోనే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనుంది.

యువతకు ప్రాధాన్యం : కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో.. కష్టకాలంలోనూ టీడీపీను అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు. కొందరు అతి సామాన్యులను పదవులతో గౌరవించింది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, యువతకు ప్రాధాన్యమిచ్చారు. 20 మంది ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ పోస్టుల్లో ఏడుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఒకరు ముస్లిం మైనార్టీకి చెందిన వారున్నారు. టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జుల్లో 11 మందికి, యూనిట్‌ ఇన్‌ఛార్జుల్లో ఆరుగురికి పదవులు లభించాయి. జనసేనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్, ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) ఛైర్మన్‌ పోస్టులను, బీజేపీకు 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ పోస్టును కేటాయించింది.

ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం : ఇటీవలి ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్‌ దక్కని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు వంటి సీనియర్లకు ఈ పోస్టుల భర్తీలో సముచిత ప్రాధాన్యమిచ్చారు. కొనకళ్లను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు పోటీచేసి, రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ లేదా పెడన ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన ఆర్టీసీ ఛైర్మన్‌ పోస్టులో నియమించారు. అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో పీలా గోవిందు మొదట్లో కొంత అసంతృప్తితో ఉన్నా, అధినేత ఆదేశాలకు కట్టుబడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయానికి కృషి చేశారు. అందుకు గుర్తింపుగా ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల టీడీపీ టికెట్‌ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకే ఖాయమనుకున్నారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. కానీ ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో బంగార్రాజుకు నిరాశ ఎదురైంది. ఇప్పుడాయన్ను కీలకమైన మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ పదవి వరించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి టీడీపీ కన్వీనర్‌గా ఉన్న బొరగం శ్రీనివాసులుకు గత ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో నిలపగా, శ్రీనివాసులు సహకరించారు. ఆయనకు ఏపీ ట్రైకార్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది.

రఘురామ విజయానికి కృషి : ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన మంతెన రామరాజు పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ టికెట్‌ త్యాగం చేశారు. ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజే అభ్యర్థిగా పార్టీ మొదట్లో ప్రకటించింది. చివరకు అక్కడ రఘురామకృష్ణరాజుకు టికెట్‌ ఇవ్వాల్సి రావడంతో, రామరాజు పోటీ నుంచి వైదొలిగారు. రఘురామ విజయానికి కృషిచేశారు. దానికి గుర్తింపుగా కీలకమైన ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి ఆయనకు దక్కింది. 2021 నుంచి డోన్‌లో టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న మన్నె సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తొలుత ఆయనకే టికెట్‌ ఇస్తామని అధినేత ప్రకటించారు. చివరకు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వంటి సీనియర్‌ నాయకుడికి అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు.

2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి, నెల్లూరు మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్‌ అజీజ్‌ కొద్దికాలానికే టీడీపీలో చేశారు. 2019లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో ఈ సీటును వైకాపా నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కేటాయించగా, అజీజ్‌ పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన్ను వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబుకు బదులు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజును అక్కడి నుంచి బరిలో నిలిపారు. ఇప్పుడు ఆయనకు ఏపీ హౌసింగ్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. జనసేనలో తమ్మిరెడ్డి శివశంకర్‌ పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పని చేశారు. కానీ అక్కడ పంచకర్ల రమేశ్‌బాబుకు టికెట్‌ ఇవ్వడంతో, శివశంకర్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పుడాయనకు ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు.

2019, 2024 ఎన్నికల్లో దక్కని టికెట్‌ : ప్రకాశం జిల్లాకు చెందిన దామచర్ల సత్య పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కీలక ఏపీ మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. 2014 ఎన్నికల్లో చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాత మంత్రిగానూ పని చేశారు. తర్వాత మంత్రి పదవి కోల్పోయినా, పార్టీకి విధేయురాలిగా ఉన్నారు. 2019, 2024 ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోయినా, పార్టీ అభ్యర్థుల విజయానికి నిబద్ధతతో పని చేశారు. ప్రతిఫలంగా వినియోగదారుల రక్షణ మండలి ఛైర్మన్‌ పదవి లభించింది.

నూకసాని బాలాజీ 2014లో వైఎస్సార్సీపీ తరఫున ప్రకాశం జడ్పీ వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికై, తర్వాత ఛైర్మన్‌గానూ పని చేశారు. 2015లో టీడీపీలో చేరి 2020 నుంచి ఒంగోలు లోక్‌సభ స్థానం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2024లో టికెట్‌ ఆశించినా, దక్కలేదు. ఆయన్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు.

ఆయనపై 57 కేసులు : టీడీపీ ఎమ్మెల్సీగా పని చేసిన దీపక్‌రెడ్డి 2024లో అనంతపురం జిల్లా రాయదుర్గం టికెట్‌ ఆశించారు. ఆయనకు సీడాప్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది. ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులైన కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం చంద్రబాబుకు సన్నిహితుడు. ఎస్వీయూలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. శాప్‌ ఛైర్మన్‌గా నియమితులైన రవినాయుడు విద్యార్థి దశ నుంచి టీడీపీలో కీలకంగా పని చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో వివిధ పదవులు చేపట్టారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడిగా, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, కార్యక్రమాల సమన్వయకర్తగా పనిచేశారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రలో క్రియాశీలంగా పనిచేశారు. ఆయనపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం 57 కేసులు పెట్టింది. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా రవినాయుడికి కీలక పదవి దక్కింది. చంద్రబాబు కుటుంబంతో రవినాయుడి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి.

2017లో టీడీపీలో చేరిన పిల్లి మాణిక్యరావు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు. సామాన్య నాయకుడే అయినా, పార్టీని అంటిపెట్టుకొని పని చేశారు. ఆయన్ను తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఒంగోలుకు చెందిన లంకా దినకర్‌ వృత్తి రీత్యా ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌. మొదట్లో టీడీపీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షం కోటాలో ఆయనకు పదవి లభించింది.

నామినేటెడ్ పదవుల పండుగ - సామాజిక సమతూకంతో తొలి విడత - AP Nominated Posts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.