ETV Bharat / politics

సికింద్రాబాద్​ పార్లమెంట్​ టికెట్ ఇస్తే గెలిచేవాడిని : వీహెచ్​ - Congress leader VH on Rajya Sabha - CONGRESS LEADER VH ON RAJYA SABHA

Former PCC Chief Hanumanth Rao Pressmeet : గత ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని, సీఎం రేవంత్​ రెడ్డి తనకు రాజ్యసభ సభ్యుడుగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇస్తే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు.

V Hanumantha Rao Press Meet
Former PCC President V Hanumanth Rao (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 7:34 PM IST

Updated : Jul 10, 2024, 9:25 PM IST

Congress Leader V Hanumanth Rao on CM Revanth Governance : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతురావు (వీహెచ్​) అభిప్రాయపడ్డారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్నానన్న హనుమంతరావు, సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇచ్చి ఉంటే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. తెలంగాణ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్‌, టికెట్‌ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కురియన్‌ కమిటీ తొలుత ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలును కలవాలన్నారు.

"ఎనిమిదేళ్లుగా నాకేమైనా పదవి ఉందా? కానీ కాంగ్రెస్​ గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తాను. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అన్నిచోట్ల తిరిగాను. పదేళ్లపాటు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని, అందుకు నా నుంచి ఏవైనా సలహాలు అడిగితే తప్పకుండా చెబుతాను." -వి.హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు

Former PCC Chief VH On Sports : టీ-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్​కు వీహెచ్​ శుభాకాంక్షలు తెలిపారు. టీమ్‌లో సభ్యుడైన సిరాజ్‌ హైదరాబాద్‌ నివాసి అని, ఆయనకు సీఎం ఫ్లాట్‌, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని వివరించారు. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మన్‌గా తాను సన్మానించినట్లు పేర్కొన్న హనుమంతురావు, దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్​ ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మినహా, ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదని, ఏపీలో 12 క్రికెట్‌ స్టేడియాలు ఉన్నట్లు తెలిపారు. క్రికెట్‌ స్టేడియాల నిర్మాణానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో క్రీడలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్​ ప్రోత్సహించలేదన్న ఆయన, నాడు ఎకరం భూమి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. క్రీడలను ప్రోత్సహించాలని, అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు బడ్జెట్​లో ఎక్కువ నిధులు కూడా కేటాయించాలని కోరారు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తున్న రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలని వీహెచ్‌ తెలిపారు.

వీహెచ్‌కు బుజ్జగింపులు - అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్​ ​భరోసా - VH meets CM Revanth Reddy

బీఆర్​ఎస్ నేతలను కాంగ్రెస్​లోకి ఎందుకు చేర్చుకుంటున్నారు : వీహెచ్‌ - Congress Leader VH Fire on CM

Last Updated : Jul 10, 2024, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.