ETV Bharat / politics

2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం - అత్యధిక సీట్లు బీఆర్​ఎస్​కే : కేటీఆర్ - KTR ON PARLIAMENT POLLS 2024 - KTR ON PARLIAMENT POLLS 2024

KTR Fires on Congress : రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్​ పార్టీల వైఖరి దిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్​ రెడ్డి కమలనాథులకు సహకరించారని ఆరోపించిన ఆయన, ఆ పార్టీని గెలిపించడానికి కిషన్‌ రెడ్డి కంటే, రేవంత్‌ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు.

KTR Fires on Congress and bjp
KTR (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 4:54 PM IST

Updated : May 14, 2024, 5:31 PM IST

KTR Comments on Lok Sabha Polls : రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ సరళిపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్​పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన, రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, నెలకు రూ.2500 ఇవ్వలేదని రాష్ట్రంలోని మహిళలు సైతం కాంగ్రెస్​ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు.

భారతీయ జనతా పార్టీపైనా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోదీపై కోపంతో ఉన్నారని తెలిపారు. దిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీల వైఖరి ఉందని దుయ్యబట్టిన మాజీ మంత్రి, ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్​ రెడ్డి కమలనాథులకు సహకరించారని ఆరోపించారు. ఆ పార్టీని గెలిపించడానికి కిషన్‌ రెడ్డి కంటే, రేవంత్‌ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే దిల్లీలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

చెన్నూరులో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్‌ - KTR Election Campaign

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు చేసినా, బస్సు యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో రేవంత్​ సర్కార్​పై అన్నదాతలు, ఆడబిడ్డలు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై వ్యతిరేకత కనిపిస్తుంది. దిల్లీలో కుస్తీలు-గల్లీలో దోస్తీలాగా 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు చేశారు. ఆ 2 పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అత్యధికంగా మెజార్టీ సీట్లు మేమే సాధిస్తాం. -కేటీఆర్, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం - అత్యధిక సీట్లు బీఆర్​ఎస్​కే : కేటీఆర్ (Etv Bharat)

మరోవైపు బీఆర్​ఎస్​ ఈసారి సగం సీట్లు బీసీ కులాలకు కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. 2 జాతీయ పార్టీలకు తమ పార్టీ ముచ్చెమటలు పట్టించిందన్న ఆయన, 3 పార్టీల్లో తమకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేశారన్న కేటీఆర్, వారి కష్టం వృథాగా పోదని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు.

చింతమడకలో కేసీఆర్ - నందినగర్​లో కేటీఆర్ ఓటు - తొలిసారి ఓటేసిన హిమాన్షు - kcr family casted vote

6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితికి కేసీఆర్ : కేటీఆర్ - Huzurabad KTR Road Show

Last Updated : May 14, 2024, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.