ETV Bharat / politics

కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం : కేసీఆర్‌ - Former Deputy CM Rajaiah Meet KCR - FORMER DEPUTY CM RAJAIAH MEET KCR

Former Deputy CM Rajaiah Meet KCR : మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్​ఎస్​ ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమన్నారు.

Telangana Politics 2024
Former Deputy CM Rajaiah Meet KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 10:08 PM IST

Updated : Apr 14, 2024, 10:34 PM IST

Former Deputy CM Rajaiah Meet KCR : బీఆర్​ఎస్​ పార్టీ తరఫున స్టేషన్ ఘన్​పూర్ శాసనసభ నియోజకవర్గ ఇంఛార్జీగా, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గులాబీ​ బాస్​ను, ఆయన నివాసంలో తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కలిశారు. ఈ క్రమంలోనే నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్​ అధినేత​, కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని తెలిపారు.

కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా బీఆర్ఎస్ తరఫున పూర్తిగా పోరాటం చేస్తామని కేసీఆర్​ స్పష్టం చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు. అదేవిధంగా వరంగల్ లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి సుధీర్ కుమార్ విజయం కోసం పని చేయాలని రాజయ్యను కేసీఆర్ కోరారు. పార్టీ నేతలను, కేడర్‌ను సమన్వయం చేసుకొని ముందుకు నడవాని సూచించారు. కష్టపడేవారిని పార్టీ గుర్తింపు నిస్తుందని, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రజల కోసం బతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటా : కేసీఆర్ - BRS Praja Ashirwada Sabha

Ex MLA Rajaiah Re Joins in BRS : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​కు మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కూడా పిలుపు రావడంతో ములుగు మండలం నాగిరెడ్డిపల్లి శివారులోని ఓ ఫామ్ హౌస్​లోకి(Farm House) రాజయ్య తన సన్నిహితులతో కలిసి వచ్చారు. ఎంపీ టికెట్ ఖరారు చేసిన తర్వాతే తాను కేసీఆర్​ను కలిసేందుకు వెళ్తానని ఆ వ్యవసాయ క్షేత్రంలో కాసేపు వేచి చూశారు.

చివరకు వరంగల్ లోక్​సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్​ను, కేసీఆర్ ప్రకటించడంతో రాజయ్య అక్కడి నుంచి గులాబీ దళపతికి కలవకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై తరువాత ఆయన ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఏదేమైనప్పటికీ ఇవాళ రాజయ్య కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలవటం, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. దీంతో మరల రాజయ్య సొంత గూటికి చేరినట్లైంది.

కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు - Harish Rao Reacts on BJP Manifesto

ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్​ - Ambedkar Jayanthi Celebrations

Last Updated : Apr 14, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.