First List of Telangana BJP Lok Sabha Candidates : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా(BJP MP Seats First List)ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు లోక్‌సభ(Lok Sabha) అభ్యర్థులను వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 17లోక్‌సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, నిజామాబాద్ - ధర్మపురి అరవింద్, కరీంనగర్ - బండి సంజయ్, జహీరాబాద్ - బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ - భరత్ ప్రసాద్, మల్కాజిగిరి - ఈటల రాజేందర్, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ - డాక్టర్ మాధవి లత, చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ సిట్టింగ్‌ల్లో ముగ్గురికి మరోసారి అవకాశం దక్కగా ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఈ స్థానం నుంచి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా లేక సిట్టింగ్ వ్యక్తికే మరోసారి అవకాశం దక్కుతుందా అనేది వేచి చూడాలి.
BJP Lok Sabha 2024 : వారం రోజుల క్రితం బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు అతని కుమారుడు భరత్ కుమార్‌కు టికెట్ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్ఠానం భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది. ఇక రెండు రోజుల క్రితం బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు మళ్లీ జహీరాబాద్ నుంచే టికెట్ దక్కింది. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాధవీ లతకు కేటాయించారు.
తెలంగాణ బీజేపీ 9 మంది అభ్యర్థుల జాబితా :
క్ర.మ | పార్లమెంటరీ స్థానాలు | అభ్యర్థులు |
1 | కరీంనగర్ | బండి సంజయ్ |
2 | నిజామాబాద్ | ధర్మపురి అర్వింద్ |
3 | మల్కాజిగిరి | ఈటల రాజేందర్ |
4 | సికింద్రాబాద్ | కిషన్ రెడ్డి |
5 | భువనగిరి | బూర నర్సయ్యగౌడ్ |
6 | చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
7 | జహీరాబాద్ | బీబీ పాటిల్ |
8 | నాగర్ కర్నూల్ | భరత్ ప్రసాద్ |
9 | హైదరాబాద్ | మాధవీలత |
భరత్ ప్రసాద్ : లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడ పోతుగంటి భరత్ ప్రసాద్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. 1987 ఆగస్టు 7న జన్మించాడు. తల్లిదండ్రులు రాములు-భాగ్యలక్ష్మి. ఎంటెక్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. భరత్ ప్రసాద్ 2018లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కల్వకుర్తి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం వచ్చిన బీఆర్ఎస్ అవకాశం ఇవ్వలేదు. అలాగే 2023లో శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి తన తండ్రికి లేదా భరత్ ప్రసాద్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు కానీ ఆ అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలకు సైతం రాములును, భరత్‌ను పార్టీ ఆహ్వానించలేదు. దీంతో బీజేపీ తీర్థం పుచ్చుకుని తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు రాములు.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్- వారణాసి నుంచి మోదీ పోటీ
రాష్ట్రంలో 17కు 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటాం : బండి సంజయ్