ETV Bharat / politics

'సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లా? - అఖిలపక్ష సమావేశం తర్వాత మూసీపై ముందుకెళ్లండి' - HARISH RAO MEET HYDRA VICTIMS - HARISH RAO MEET HYDRA VICTIMS

BRS MLA Harish Rao Fires on Cong Govt : పేదల ఇళ్లు కూల్చేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతిస్తారా అంటూ బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ హైడ్రా బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

BRS MLA Harish Rao Fires on Cong Govt
BRS MLA Harish Rao Fires on Cong Govt (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 12:29 PM IST

Updated : Sep 28, 2024, 12:45 PM IST

BRS MLA Harish Rao Meet HYDRA Victims : సీఎం రేవంత్​ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. మూసీపై అఖిలపక్ష సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సూచించారు. బీఆర్​ఎస్​ లీగల్​ బృందం బాధితులకు అండగా ఉంటుందని హరీశ్​రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్​కు వచ్చిన మూసీ ప్రాంత బాధితులతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీఆర్​ఎస్​ లీగల్​ సెల్​ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ, మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్​ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని గుర్తు చేశారు. హైడ్రా తన ఇంటిని కూల్చుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సీఎంకు లేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారంటూ ప్రశ్నించారు. అందుకే బాధితులకు రక్షణ కవచంలాగా బీఆర్​ఎస్​ ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్​ఎస్​ లీగల్​ బృందం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

పేదల ఆశీర్వాదాలు ఉండాలి - గోస కాదు : 'మా ఎమ్మెల్యేల బృందంతో బాధితుల ఇళ్లను సందర్శిస్తాం. బీఆర్​ఎస్​ లీగల్​ సెల్​ నుంచి బాధితులకు సాయం అందిస్తాం. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలి, వారి గోసలు కాదు. హైదరాబాద్​ ఖ్యాతిని రేవంత్​ దెబ్బ తీస్తున్నారు. మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లా? అఖిలపక్ష సమావేశం నిర్వహించి మూసీపై ముందుకెళ్లాలి. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి?.' అని బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు ప్రశ్నించారు.

"రేవంత్​ రెడ్డి మూసీలో గోదావరి నీరు కాదు పేదల కన్నీళ్లు పారిస్తున్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలి తప్పా, వారి గోసలు కాదు. రాహుల్​ గాంధీ బుల్డోజర్లు గురించి దేశమంతా చెబుతున్నావు. మరి మీ పార్టీ పాలిస్తున్న తెలంగాణలో ఏం నడుస్తోంది. హైదరాబాద్​ ఇమేజ్​ను రేవంత్​ డ్యామేజ్​ చేస్తున్నారు. మీ సోదరుడికి నోటీసులు, పేదల ఇళ్లకు బుల్డోజర్లు ఏంటి. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మూసీ గురించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలి. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి?" - హరీశ్​రావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

కొడంగల్​లో రేవంత్​ రెడ్డి ఇల్లే చెరువులో ఉంది : మేమంతా మీకు అండగా ఉంటాం. కొడంగల్​లో రేవంత్​ రెడ్డి ఇల్లే చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. బాధితులకు అండగా ఉండాలని కేసీఆర్​ మాకు సూచించారు. తొమ్మిది నెలల్లో రేవంత్​ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు. బీఆర్​ఎస్​ తరఫున బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.

'మా ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందేమో' - భయంతో మహిళ ఆత్మహత్య - Woman Suicide Due to Hydra

'హైడ్రా, ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ - ఈ పేర్లు వింటేనే మా గుండె ఝళ్లుమంటుంది సారూ' - HYDRA Victims At Telangana Bhavan

Last Updated : Sep 28, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.