ETV Bharat / politics

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరాను : కేసీఆర్​ - Ex CM KCR Election Campaign

KCR Bus Yatra in Jagital : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరానని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. బీఆర్​ఎస్​కు ఎంపీలు ఎందుకు అంటున్నారు, నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు ఒక్క పైసా అయినా తెలంగాణకు తెచ్చారా అంటూ బీజేపీ ఎంపీలకు ప్రశ్నల వర్షం కురిపించారు.

KCR Bus Yatra in Jagital
KCR Bus Yatra in Jagital (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:11 PM IST

Updated : May 5, 2024, 10:41 PM IST

Ex CM KCR Election Campaign in Jagital : ఇక్కడి కరవు పరిస్థితులను చూసి వరద కాల్వను పునరుజ్జీవ పథకంతో నీళ్లతో నింపామని బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. ఇప్పుడు కాల్వను ఎందుకు ఎండ బెడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. జగిత్యాల జిల్లా చేసుకున్నాం కానీ రేవంత్​ రెడ్డి తీసేస్తానని అంటున్నారని జిల్లా కావాలా వద్దా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సు యాత్ర రోడ్​ షోలో కేసీఆర్​ పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో కరీంనగర్​, పెద్దపల్లి, నిజామాబాద్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థులు వినోద్​ కుమార్​, కొప్పుల ఈశ్వర్​, బాజిరెడ్డి గోవర్ధన్​ను మాజీ సీఎం కేసీఆర్​ పరిచయం చేశారు.

రైతుబంధు వచ్చిందా డబ్బులు ఖాతాల్లో పడ్డాయా, మరి సీఎం రేవంత్​ రెడ్డి ఖాతాల్లో డబ్బులు జమ చేశానని అంటున్నారని మాజీ సీఎం కేసీఆర్​ ఎద్దేవా చేశారు. అలాగే ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రధాని మోదీ 15 లక్షలు వేశారంట జగిత్యాలలో ఉన్నవారికి రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ పార్టీ అంటేనే మోసం, మభ్యపెట్టే మోసాలతో ఓట్లు దండుకున్నారని మాజీ సీఎం కేసీఆర్​ సీరియస్​ అయ్యారు. రైతుబంధు ఐదు ఎకరాలకు సీలింగ్​ పెడతారట, 25 ఎకరాలకు పెట్టాలని సూచించారు.

బీఆర్​ఎస్​కు ఎంపీలు ఎందుకు అంటున్నారు, నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు ఒక్క పైసా అయినా తెలంగాణకు తెచ్చారా అంటూ బీజేపీ ఎంపీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిజామాబాద్​లో గెలిచిన అర్వింద్​ పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. నూకలు తినమన్న నూకరాజు ప్రధాని మోదీ అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు తీసుకుపోతానని ప్రధాని మోదీ అంటున్నారు, ఇలా తీసుకొని వెళ్లిపోతే మన జలాల గురించి ఎవరు కొట్లాడుతారు, బీజేపీ వాళ్లు అంటూ విమర్శలు చేశారు.

బీఆర్​ఎస్ సెక్యులర్​ పార్టీ : జగిత్యాలలో యువకులు చాలా మంది ఉన్నారు ఈ దేశం మీది ఆలోచించి ఓటు వేయాలని మాజీ సీఎం కేసీఆర్​ కోరారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరే అంచనా వేసుకొండని హితవు పలికారు. సబ్​ కా సాత్​, సబ్​ కా వికాస్​ అన్నారు ఏం చేశారు, చివరికి సత్యనాశ్​ అయిందని ఆవేదన చెందారు. బీజేపీ సమాజంలో వైషమ్యాలను పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బీఆర్​ఎస్​ అలా కాదు సెక్యులర్​ పార్టీ అని కొనియాడారు. పేగులు తెగేదాకా కోట్లాడి తెచ్చిన తెలంగాణ ఎలా అయిందో చూస్తుంటే బాధ అనిపిస్తుందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని మాజీ సీఎం కేసీఆర్​ జగిత్యాల ప్రజలకు వివరణ ఇచ్చారు.

"రాహుల్​ గాంధీ నిర్మల్​ మీటింగ్​లో మహిళలకు రూ.2500 వేస్తామని చెబుతున్నారు. రాలేదా? ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చెప్పారు రూ.2 లక్షలు రుణమాఫీ అయిందా? తెలంగాణ మొత్తం అడిగినా ఇదే మాట చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏ ఊరికి పోతే ఆ ఊరులో దేవుడి మీద ఒట్టు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడిపడితే అక్కడ దేవుడి మీద ఒట్టులు వేస్తున్నారు. ఇలా చేసిన ముఖ్యమంత్రిని నమ్మవచ్చా? నమ్మే పరిస్థితి ఉందా?" - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరాను : కేసీఆర్​ (etv bharat)

అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్​ఎస్​దే గెలుపు : కేసీఆర్ - BRS Public Meeting at Huzurabad

బీఆర్​ఎస్​ ఎంపీల గెలుపులోనే - తెలంగాణ గెలుపు ఉంది : కేసీఆర్​ - Ex CM KCR Election Campaign

Last Updated : May 5, 2024, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.