Etela Rajender press meet at Malkajgiri : 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో లక్ష మెజార్టీతో బీజేపీ గెలిచిందని మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వాదిస్తారని తెలిపారు. ప్రజలు మోదీకి ఓటు(Vote for Modi) వేయడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. మల్కాజిగిరిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మల్కాజిగిరిలో తాను గత 32 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(Etela Question to CM Revanth) నియోజకవర్గానికి, ప్రజలకు ఏం చేశారో తెలుసుకోవడానికి మల్కాజిగిరి చౌరస్తా వద్ద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా సీఎం రేవంత్ తిరిగారా లేక తాను తిరిగానా అనేది తేల్చుకుందామా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ
మళ్లీ మోదీనే పీఎం : దేశంలో మళ్లీ ప్రధాని అయ్యేది మోదీ(PM Modi)నే అని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, తాము ప్రజల మధ్య తిరిగినప్పుడు చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరవు అయ్యారని దుయ్యబట్టారు. కచ్చితంగా ఈ లోక్‌సభ ఎన్నికలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Etela Rajender Fires on CM Revanth : చదువుకున్న వాళ్లను అడిగితే ఈ దఫా మోదీనే ప్రధాని అవుతారు అంటున్నారు. బస్తీలల్లో అడిగితే సామాన్య ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడి ఎన్నికలు, వచ్చేవి మోదీ ఎన్నికలు కదా తప్పకుండా గెలుస్తారు అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈసారి మోదీనే ప్రధాని అవుతారని అంటున్నారని చెప్పారు.
Telangana BJP LOk Sabha Candidates List : బీజేపీ అధిష్ఠానం ప్రకటించిన మొదటి జాబితాలో 195 అభ్యర్థులకు చోటు దక్కింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం తొమ్మిది పేర్లను ప్రకటించారు. అందులో సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డి ఉండగా, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. రెండో జాబితాలో 72 మందితో ప్రకటించగా మొత్తం ఆరు పేర్లను ఖరారు చేశారు. దీంతో 17 ఎంపీ స్థానాలకు 15 స్థానాల అభ్యర్థులను ప్రకటించి, కేవలం ఖమ్మం, వరంగల్ స్థానాలను మాత్రమే పెండింగ్లో ఉంచింది.
బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా