ETV Bharat / politics

సూపర్​ స్టార్​ను గెలిపించి ఓడించిన ఏలూరు - నేడు ఉత్కంఠ రేపుతున్న పోరు - ELURU LOK SABHA ELECTIONS - ELURU LOK SABHA ELECTIONS

Eluru Lok Sabha Constituency : సూపర్​ స్టార్ ఘట్టమనేని కృష్ణకు రాజకీయ జీవితాన్ని అందించింది ఏలూరు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో విజయాన్ని అందించిన ఓటర్లు ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఓడించారు. నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్​, టీడీపీ పోటాపోటీ విజయాలు దక్కించుకున్నాయి. రాష్ట్రానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టు ఏలూరు జిల్లాలోనే ఉంది.

Eluru_Lok_Sabha_Constituency
Eluru_Lok_Sabha_Constituency
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 12:29 PM IST

Eluru Lok Sabha Constituency: సూపర్​ స్టార్ ఘట్టమనేని కృష్ణకు రాజకీయ జీవితాన్ని అందించింది ఏలూరు. అలనాటి నటి కన్నాంబ, తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత, ఆర్​బీఐ మాజీ గవర్నల్​ దువ్వూరి సుబ్బారావు, వర్ధమాన గాయని మోహన భోగరాజు అంతా ఏలూరు వాసులే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంచినీటి సరస్సు కొల్లేరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:

ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

  1. ఉంగుటూరు
  2. దెందులూరు
  3. ఏలూరు
  4. పోలవరం(ఎస్టీ)
  5. చింతలపూడి(ఎస్సీ)
  6. నూజివీడు
  7. కైకలూరు

ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ 9 సార్లు విజయం సాధించి మొదటి స్థానంలో ఉండగా, టీడీపీ 5సార్లు గెలుపొంది రెండోస్థానంలో ఉంది. ఈ లోక్​సభ నియోజకవర్గంలో సీపీఐ 2సార్లు, వైసీపీ ఒకసారి జెండా ఎగురవేశాయి.

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 16.25 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 7.94 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 8.30 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 129
Eluru_Lok_Sabha_Constituency
ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ టీడీపీ నుంచి బరిలో దిగిన మాగంటి వెంకటేశ్వర రావు(బాబు)పై లక్షా 65వేల ​925 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోటగిరి శ్రీధర్‌ 51.90 శాతం ఓట్లు రాబట్టుకోగా మాగంటి 39.18 శాతం ఓట్లు సాధించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీకి చెందిన అభ్యర్థి తోట చంద్రశేఖర్‌పై టీడీపీ నుంచి బరిలో దిగిన మాగంటి వెంకటేశ్వరరావు లక్షా 19వందల 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే: ఏలూరు లోక్​సభ నియోజకవర్గం నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఉద్దేశంతో పుట్టా మహేష్​ యాదవ్​కు టీడీపీ అవకాశం ఇచ్చింది. మహేష్‌ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీలో సీనియర్ నేత. ఆయన ఈ ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి అల్లుడు కూడా.

మరోవైపు వైఎస్సార్సీపీ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపింది. సునీల్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం. ఇక కాంగ్రెస్‌ నుంచి జంగారెడ్డిగూడేనికి చెందిన కావూరి లావణ్య పోటీ చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ అయిన ఆమె, ఇటీవల కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకుని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు:

  • 1952: బయ్య సూర్యనారాయణ మూర్తి(సీపీఐ)
  • 1957: మోతె వేద కుమారి(సీపీఐ)
  • 1962: వి. విమల దేవి(కాంగ్రెస్‌)
  • 1967: కొమ్మారెడ్డి సూర్యనారాయణ(కాంగ్రెస్‌)
  • 1971: కొమ్మారెడ్డి సూర్యనారాయణ(కాంగ్రెస్‌)
  • 1977: కొమ్మారెడ్డి సూర్యనారాయణ(కాంగ్రెస్‌)
  • 1980: చిత్తూరి సుబ్బారావు చౌదరి(కాంగ్రెస్‌)
  • 1984: బోళ్ల బుల్లి రామయ్య(టీడీపీ)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 1989: ఘట్టమనేని కృష్ణ(కాంగ్రెస్‌)- బొల్లా బుల్లి. రామయ్య(టీడీపీ)
  • 1991: బోళ్ల బుల్లి రామయ్య(టీడీపీ)- ఘట్టమనేని. కృష్ణ(కాంగ్రెస్)
  • 1996: బోళ్ల బుల్లి రామయ్య(టీడీపీ)- మాగంటి. వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)
  • 1998: మాగంటి వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)- బొల్లా బుల్లి. రామయ్య(టీడీపీ)
  • 1999: బోళ్ల బుల్లి రామయ్య(టీడీపీ)- మాగంటి. వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)
  • 2004: కావూరి సాంబశివ రావు(కాంగ్రెస్‌)- బొల్లా బుల్లి. రామయ్య(టీడీపీ)
  • 2009: కావూరి సాంబశివ రావు(కాంగ్రెస్‌)- మాగంటి. వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)
  • 2014: మాగంటి వెంకటేశ్వరరావు(టీడీపీ)- తోట చంద్రశేఖర్(వైఎస్సార్సీపీ)
  • 2019: కోటగిరి శ్రీధర్‌(వైసీపీ)- మాగంటి. వెంకటేశ్వరరావు(టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.