ETV Bharat / politics

కాయ్‌ రాజా కాయ్‌లో తేలిపోతున్న ఫ్యాన్‌ గాలి- అధికార మార్పిడిపై వెయ్యి కోట్లు బెట్టింగ్స్‌ - Election Betting in Ap - ELECTION BETTING IN AP

Election Bettings : కాయ్‌ రాజా కాయ్‌కు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన వనరుగా మారింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలుగా బెట్టింగ్‌ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై కోట్ల రూపాయలు బెట్టింగ్‌ వేస్తున్నాయి. YSRCP విజయంపై ఎప్పుడూ ధీమాగా ఉండే కడప బెట్టింగ్‌ టీమ్స్‌ సైతం ఫ్యాన్‌ పార్టీపై ఫర్ఫార్మెన్స్​పై వెనకడుగు వేయడం గమనార్హం. జగన్‌, లోకేశ్‌ల మెజార్టీ, గుడివాడ, కడప ఎంపీలపై ఎక్కువగా బెట్టింగ్‌ చేస్తున్నారు.

Betting on YSRCP and TDP
Election Bettings (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 2:15 PM IST

Election Bettings in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడటంతో బెట్టింగ్‌ గ్యాంగ్‌లు జోరు పెంచాయి. పార్టీలు, నేతలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే, అదే స్థాయిలో బెట్టింగ్‌ టీమ్స్‌ స్పీడ్ పెంచాయి. ఊరించే ఆప్షన్లు బుకీలు పందెం రాయళ్ల ముందు ఉంచుతున్నారు. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేలు ఆధారంగా బెట్టింగ్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప, భీమవరం, సిద్ధిపేట, పొద్దటూరులు సత్తామార్కెట్‌కు ప్రధాన అడ్డాలు. నేషనల్‌ ఎక్సేంజ్‌, సెవన్‌హిల్స్‌, కవర్స్‌, పొలిటికల్ బెట్టింగ్‌. కామ్‌, బుకీష్‌.కామ్‌ వంటి వెబ్‌సైట్లలో ఫంటర్లు ఆప్షన్లు ఇస్తారు.

భీమవరం, కడప బెట్టింగ్ బ్యాచ్‌లు సొంతంగా సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా సత్తా మార్కెట్‌లో ట్రెండ్స్ నడుపుతున్నాయి. బెట్టింగ్‌ యాప్స్‌ అన్నీ తెలుగుదేశం కూటమి మ్యాజిక్‌ మార్క్‌దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాకు వచ్చాయి. ఎన్డీయే కూటమి 95 -105 మధ్య సీట్లు సాధిస్తుందనే అంచనాతో బెట్టింగ్‌ చేస్తోంది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆప్షన్‌లో బెట్టింగ్‌ చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా సీట్ల సంఖ్యపైనే బెట్టింగ్‌ చేస్తున్నారు. కానీ కడప బెట్టింగ్‌ టీమ్‌ మాత్రం వైఎస్సార్సీపీ 70-74 గ్యారెంటీగా గెలుస్తోందనే విశ్వాసాన్ని ఉంచి పందెం కాస్తున్నాయి.

Betting on YSRCP and TDP : అదే సమయంలో YSRCP రాయలసీమలో 30-33మార్క్‌ చేరుకుంటుందని బెట్టింగ్‌ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో YSRCP భారీగా నష్టపోతుందని అక్కడ కేవలం 11సీట్ల లోపే ఉంటాయన్నది పందెంరాయుళ్ల అంచనా. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, విశాఖ, ఉభయగోదావరిజిల్లాలు తెలుగుదేశం కూటమికి పట్టం కడతాయని లెక్కిస్తున్నారు. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు, అరకు పార్లమెంట్‌ పరిధిలో వైఎస్సార్సీపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పందెంరాయుళ్ల లెక్క.

వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసేవారు ఇప్పుడు పందెం కాయాలంటే అది 1:10 రేషియోలోనే. అంటే ఒకశాతం ప్రత్యర్థి వర్గం బెట్టింగ్ కాసి అనకున్న పార్టీ గెలిస్తే, వీళ్లు అందుకు పదిరెట్లు అదనంగా చెల్లించాలి. ఇంత రిస్కీ బెట్టింగ్ జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్లట్లేదు. ఇలాంటి విభిన్న అంచనాలతో దాదాపు 1,000 కోట్ల విలువైన బెట్టింగ్‌ వివిధ యాప్స్‌లో నిక్షిప్తమైందని బుకీలు చెబుతున్నారు.

హాట్‌ ఫేవరెట్‌ సీట్స్‌ : అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా బెట్టింగ్‌ చేస్తున్నారు. హాట్ ఫేవరెట్లుగా పవన్ కల్యాణ్‌, వైఎస్‌ జగన్, నారా లోకేశ్‌, బాలకృష్ణ, కొడాలి నాని పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. పవన్‌, జగన్‌, లోకేశ్‌లపై మెజార్టీలపై ఎక్కువగా బెట్టింగ్‌ జరుగుతుంటే గుడివాడపై విభిన్నంగా ఉంది. కొడాలి నాని గెలుపు అసాధ్యమన్న అంచనాతో ఎక్కవ మంది బెట్టింగ్‌ చేస్తున్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థికి రూ.2 వేస్తే, YSRCP అభ్యర్థిపై రూ. 1.5పైసలే వేడయం గమనార్హం.

కడప ఎంపీ సీటు ఎవరు గెలుస్తారనే అంశంపైనా ప్రత్యేక పందెం నడుస్తోంది. బెట్టింగ్ సర్క్యూట్‌లో కడప లోక్‌సభపై దాదాపు రూ.40 కోట్లు ఉంచినట్లు బెట్టింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ షర్మిల సాధించే ఓట్లపైనా బెట్టింగ్‌ చేయడం విశేషం. పైగా పులివెందులలో జగన్ మెజారిటీ గతం కంటే తగ్గుతుందనే అంశంపైనా మరో బెట్టింగ్ సాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం సీటుపై మాత్రం దాదాపు ఎవరూ బెట్టింగ్ చేయడం లేదు.

ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన పార్టీ - కొనుగోళ్లకు రూ. 9 వేల కోట్లకు పైగా 'సిద్ధం' - YCP MONEY DISTRIBUTION IN AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.