ETV Bharat / politics

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే - ఆయన బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - ED Raids MLA Mahipal Reddy house - ED RAIDS MLA MAHIPAL REDDY HOUSE

ED Raids on Patancheru MLA Mahipal Reddy : పటాన్​చెరు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అతడి సోదరుడి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

ED Raids on Patancheru MLA Mahipal Reddy
ED Raids on Patancheru MLA Mahipal Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 9:24 AM IST

Updated : Jun 20, 2024, 12:10 PM IST

ED Searches Patancheru MLA House : బీఆర్​ఎస్​కు చెందిన పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సోదాలు జరుపుతోంది. పటాన్​చెరులోని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి నివాసం, అతని సోదరుడు మధుసూదన్​రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్​చెరులోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో పటాన్​చెరు పోలీసులు గతంలో మధుసూదన్​రెడ్డిని అరెస్ట్​ చేశారు. క్రషర్​కు సంబంధించి తహసీల్దార్​ ఫిర్యాదు మేరకు పటాన్​చెరు పోలీసులు గతంలో సోదాలు జరిపి, నిర్వహించిన మధుసూదన్​రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం సంగారెడ్డి జైలుకు కూడా తరలించారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ED Raids against BRS MLA Mahipal Reddy : ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సోదరులతో పాటు నిజాంపేట్​లోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి సీఆర్పీఎఫ్​ బలగాల బందోబస్తు మధ్య ఈ తనిఖీలు జరుపుతున్నాయి. మరికాసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మనీలాండరింగ్​కు ఏమైనా పాల్పడినట్లు తేలితే ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

'కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ.351 కోట్లు సీజ్- భారీగా ఆభరణాలు సైతం'- సీబీడీటీ అధికారిక ప్రకటన

తెలంగాణలో ఐటీ సోదాల కలకలం - ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో తనిఖీలు

Last Updated : Jun 20, 2024, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.