ETV Bharat / politics

ఆప్​ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారు : ఈడీ​

ED Press Note in Delhi Liquor Scam Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రెస్​నోట్​ విడుదల చేసింది. ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు పేర్కొన్న ఈడీ, 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.

Delhi Liquor Scam Case
ED Press Note in Delhi Liquor Scam Case
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 6:11 PM IST

Updated : Mar 18, 2024, 6:43 PM IST

ED Press Note in Delhi Liquor Scam Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశామన్న ఈడీ, రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపింది. సిసోదియా, సంజయ్‌ సింగ్, విజయ్‌ నాయర్‌ సహా 15 మందిని అరెస్టు చేశామన్న ఈడీ, హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు చేశామని వెల్లడించింది. సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపింది.

‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’ - సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌

ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారన్న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్, ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారని పేర్కొంది. కేజ్రీవాల్, సిసోదియాతో కలిసి కవిత కుట్ర పన్నారన్న అధికారులు, 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని, హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపారు. ఒక నేరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు.

దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన భర్త అనిల్​, కేటీఆర్‌, హరీశ్‌రావు

సుప్రీంలో కవిత పిటిషన్ : ఇదిలా ఉండగా, ఈ కేసులో ఈ నెల 15న అరెస్టై, ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే, తనను అరెస్ట్​ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి, తనను అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఇవాళ ఆన్​లైన్​లో సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - 7 రోజుల ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

Last Updated : Mar 18, 2024, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.