ETV Bharat / politics

యాదాద్రి ఆలయంలో కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా : భట్టి

Dy CM Bhatti Vikramarka On Yadadri Temple Incident : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సమయంలో కావాలనే తాను చిన్నపీట మీద కూర్చున్నానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు పథకాన్ని విజయవంతం చేయాలని ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు.

Dy CM Bhatti Vikramarka On Yadadri Temple Incident

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 3:08 PM IST

Updated : Mar 12, 2024, 4:19 PM IST

యాదాద్రి ఆలయంలో కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా : భట్టి

DY CM Bhatti Vikramarka On Yadadri Temple Incident : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దర్శించుకున్న సందర్భంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందనే కథనాలపై ఆయన స్పందించారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చారు. దీనిపై కొందరు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్​పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తాను చిన్నపీట మీద కూర్చున్నానని భట్టి విక్రమార్క తెలిపారు.

DY CM Bhatti Vikramarka On rumours : బంజారాహిల్స్​లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు.

'మా ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశాం. ఇందులో భాగంగా కావాలనే చిన్నపీట మీద కూర్చున్నాను. ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నా. మూడు శాఖలతో ప్రభుత్వంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నాను. ఆత్మ గౌరవంతో జీవించే మనిషిని. ఎవరూ నన్ను అవమానించలేదు. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను' -ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Mallu Ravi responce On yadadri Incident : మరోవైపు విపక్షాల ఆందోళనపై ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి స్పందించారు. యాదగిరిగుట్టలో భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) పార్టీ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయంతో పాటు గత పదేళ్లలో బీఆర్ఎస్ దళితులను అవమానించిన విషయం కూడా అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. తామంతా సమన్వయంతో పనిచేస్తున్నామని ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) తెలిపారు.

యాదాద్రి ఆలయంలో భట్టి, సురేఖను సీఎం అవమానించారు: కవిత

MLC Kavitha Fires On CM Revanth : యాదాద్రి ఆలయంలో జరిగిన ఉపముఖ్యమంత్రి(Deputy CM) భట్టికి అవమానం జరిగిందని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(MLC) కవిత కూడా స్పందించారు. అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్, ఇవాళ యాదాద్రి ఆలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించే విధంగా కింద కూర్చోబెట్టి అగ్రవర్ణాలకు చెందిన నాయకులు పైన కూర్చోవడం వివక్షతకు నిదర్శనం కాదా అని కవిత ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో పోస్టు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భట్టిని అవమానించారని ఆరోపించారు.

భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Mar 12, 2024, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.