ETV Bharat / politics

జాబితాలో టీడీపీ మద్దతుదారులు ఔట్ ! - కొత్త దరఖాస్తుల తిరస్కరణ, పాత ఓట్ల ఏరివేత - CEC

Doubts on the final list of voters : ఉరవకొండ నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తుల తిరస్కరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మద్దతుదారుల దరఖాస్తులే తిరస్కరణకు గురయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2960 దరఖాస్తుల తిరస్కరణకు గురికాగా, సరైన సమాధానం ఇవ్వడం లేదని అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

uravakonda_voters_list
uravakonda_voters_list
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 5:13 PM IST

Doubts on the Final List of Voters : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 22న వెలువరించింది. అందులో కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో చాలా వరకు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు కారణం ఏమిటో తెలియని పరిస్థితి. చాలామంది ఆన్ లైన్​లోనే దరఖాస్తు చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు వివరాలు సరిగ్గా లేవంటూ జాబితా వెలువడిన తర్వాత దరఖాస్తులను వెనక్కి పంపిస్తున్నారు.

రెండో రోజూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రత్యేక డ్రైవ్‌ - వైసీపీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు

2,960 ఓటరు నమోదు దరఖాస్తుల తిరస్కరణ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 5 వరకు 16,487 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. వాటిలో 12,988 దరఖాస్తులను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మరో 2,960 మంది దరఖాస్తులను ఆ అధికారులు తిరస్కరించారు. మరో 539 దరఖాస్తులను పెండింగ్ లో ఉంచారు. ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకున్నారు. వాటిని సంబంధిత బీఎల్ఓలు పరిశీలించి, క్షేత్ర స్థాయిలో తమ అమోదం తెలుపుతూ పై అధికారులకు ప్రతిపాదించారు. అయినా వాటిలో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

ఉరవకొండలో తప్పులతడకగా ఓటర్ల జాబితా - ఒకే ఇంటి నెంబర్​తో పదుల సంఖ్యలో ఓట్లు

టీడీపీ మద్దతుదారుల దరఖాస్తులే తిరస్కరణ : తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో అత్యధికం టీడీపీ మద్దతు కలిగిన కుటుంబాలకు చెందిన వారివేనని తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా, లేనిపోని కారణాలను చూపుతూ అధికార బలం ఒత్తిడి మధ్యన వాటిని తిరస్కరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక వర్గానికి చెందిన ఓటరు నమోదు దరఖాస్తులే అత్యధికంగా ఆమోదం పొందాయన్న వాదన కూడా ఉంది. ఇదే అంశాన్ని ఇది వరకు ఉరవకొండ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల అధికారులు నిర్వహించిన వారాంతపు రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో టీడీపీ నాయకులు పదేపదే అధికారుల దృష్టికి తెచ్చారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో చాలా మంది యువత అర్హత ఉన్నా ఓటు హక్కును కోల్పోయారు. తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ, తిరస్కరణకు గురైన దరఖాస్తులను బీఎల్ఓలు సంబంధిత దరఖాస్తుదారులకు వెనక్కి ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి.

ఏపీలో అక్రమాల సిత్రాలు- సమగ్ర పరిశీలన తర్వాత కూడా తప్పులతడకగా ఓటర్ల జాబితా

టీడీపీ మద్దతుదారులనే : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగిలో 37వ పోలింగ్ బూత్ లో 105 మంది యువత ఆన్ లైన్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేశారు. వారి అర్హతకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచారు. ఆ దరఖాస్తులను సంబంధిత బీఎల్ఓ పరిశీలించి, ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. ఆ దరఖాస్తుల మీద పై అధికారులు సంతకాలు సైతం ఉన్నాయి. అయితే వాటిలో 30 దరఖాస్తులను తిరస్కరించారు. వాటిని రెండు రోజుల క్రితం దరఖాస్తుదారులకు వెనక్కి ఇచ్చారు. సరైన ఆధారాలు లేవని, అవి వాటికి జత చేసి ఇవ్వాలని చెప్పారు. స్థానికులు వెళ్లి ఎందుకు వాటిని తిరస్కరించారని బీఎల్ఓలను ప్రశ్నించినా, సరైన సమాధానం లేదు. అయితే ఆ పోలింగు బూత్ పరిధిలో ఎక్కువ కుటుంబాలు టీడీపీకి మద్దతుగా ఉన్నాయన్న కారణంతోనే, అధికార బలం ఒత్తిడి నేపథ్యంలో వాటిని నమోదు చేయలేదన్న చర్చ నడుస్తోంది. వారంతా తమ పార్టీ మద్దతుదారులే కావడంతోనే, తిరస్కరించారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.