ETV Bharat / politics

ఔను భయ్యా!! ఆంధ్రాలో ఈసారి బాబు వస్తారా? లేదా మళ్లీ జగన్ మామేనా? - ఏపీ ఫలితాలపై హైదరాబాద్​లో చర్చలు - AP Election Result 2024

AP Assembly Election Results 2024 : ఆంధ్రప్రదేశ్​లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారనే చర్చ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ మరింత ఉత్కంఠకు తెరలేపుతోంది. ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వచ్చినా అధికారంలోకి ఎవరు వస్తారనే సందిగ్ధత కాక రేపుతోంది. దీనికి తోడు బెట్టింగ్​లతో మజా పీక్స్​ లెవల్​కి చేరుకుంటుంది. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

Discussion AP Election Result
AP Assembly Election Result 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 9:58 AM IST

AP Election Results 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా చివరకు వారి మధ్య వచ్చే సంభాషణ ఏపీ ఎన్నికల ఫలితాలు. ఎక్కడ చూసినా ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశంపైనే చర్చ జరుగుతోంది. పార్టీ వీరాభిమానులు ఇప్పటికే మేము గెలుస్తామని బెట్టింగ్​లు వేస్తూ ఎన్నికల ఫలితాలపై హైప్​ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

AP Election Result 2024 : ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై చర్చ ఉదయం కప్పు కాఫీతో మొదలై, రాత్రి భోజనాలు ముగిసి నిద్రపోయేవరకూ కొనసాగుతున్నాయి. చివరకు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏపీలో ఎవరు గెలుస్తారంట అనే చర్చ వస్తోందంటే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్​లో కొందరు ఈ ఫలితాలు ఎగ్జైట్​మెంట్​ను తట్టుకోలేక మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు ఉండడంతో సొంత నియోజకవర్గాలకు బయల్దేరుతున్నారు. గతంలో ఓట్లు వేయడానికి వెళ్లి, ఫలితాల కోసం మీడియాలో తెలుసుకునేవారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు వేరే లెవల్​లో ఉన్నాయి. గెలుపు సంబురాలను తమ వారితో చేసుకోవాలని వాహనాలు, రైళ్లు, బస్సుల్లో సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రత్యేక చర్చ - exit polls 2024

Betting on AP Election Results : ఏపీలో కూటమి గెలుస్తుందని ఎంత ధీమాగా చెబుతున్నారో మరి కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని కూడా అంతే గట్టిగా వాదిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా సర్వే సంస్థలు రకరకాల లెక్కలు చెబుతుండడంతో ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్​లు కొంత మంది వేశారని, ప్రస్తుతం బెట్టు వేసేందుకు ఎవరు సాహసం చేయట్లేదని పలువురు చెబుతున్నారు. ఆంధ్రాలోని తన మిత్రులకు ఫోను చేసి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశాలపై ఆరాతీస్తూ, బెట్టింగ్​కు సరైన నమ్మకం లేక తికమక పడుతున్నారు హైదరాబాద్ వాసులు.

Discussion AP Election Result : ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారికి ఫోను చేసి వరసలు కలుపుతూ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఆరా తీస్తున్నారు. మీ వాళ్లు అక్కడ ఉన్నారు కదా ఫోను చేసి కనుక్కోండి అంటూ నెమ్మదిగా విషయాన్ని రాబడుతూ బెరుకు, బెరుకుగానే పందేలు కాస్తున్నవారు కొంతమంది అయితే ఆలోచిస్తూ సమయం దగ్గర పడిందని ఆందోళన చెందుతున్నవారు అంతే మంది ఉన్నారు. ఏది ఏమైనా ఫలితాల కోసం మరో 24 గంటలు వరకు వేచి చూడాల్సిందే.

ఏపీలో కూటమికి జైకొట్టిన యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే - మొత్తంగా 98 నుంచి 120 సీట్లు! - AP Exit Poll 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.