ETV Bharat / politics

ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan - AP DEPUTY CM PAWAN KALYAN

AP Deputy CM Pawan Kalyan in Assembly Sessions: అసెంబ్లీ స్పీకర్​గా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రావడం చాలా సంతోషమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ అన్నారు. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 16వ శాసన సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని పవన్‌ గుర్తు చేశారు.

AP Deputy CM Pawan Kalyan in Assembly Sessions
AP Deputy CM Pawan Kalyan in Assembly Sessions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 1:45 PM IST

Updated : Jun 22, 2024, 3:41 PM IST

AP Deputy CM Pawan Kalyan in Assembly Sessions: అసెంబ్లీ స్పీకర్​గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడు రావడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ అన్నారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం 16వ శాసన సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.

66 ఏళ్ల వయస్సులోనూ ఫైర్‌ బ్రాండే - ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న : చంద్రబాబు - Chandrababu Naidu Comments

ముందుగా చంద్రబాబు ప్రసంగించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ప్రసంగించారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారని అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి పవన్‌ మాట్లాడారు. ఇప్పటివరకు ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారని, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని పవన్‌ అన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బందిపెట్టాయని పవన్‌ గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారని పవన్​ విమర్శించారు. విజయాన్ని తీసుకోగలిగారే తప్ప, ఓటమితో కూర్చోలేకనే పారిపోయారని పవన్​ ఎద్దేవా చేశారు. భావంలో ఉన్న తీవ్రత, భాషలో ఉండాల్సిన అవసరం లేదని, భాష మనసులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని ఆయన అన్నారు.

భాష విద్వేషం రేపడానికి కాదు సమస్యలను పరిష్కరించడానికని పవన్‌ కల్యాణ్​ తెలిపారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు కానీ వివాదం సృష్టించడానికి కాదన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని డిప్యూటీ సీఎం అన్నారు. మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని పవన్‌ ఆకాంక్షించారు. విభేదించడం, వాదించడం అనేవి ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులని పవన్​ సభలో అన్నారు.

ప్రజా సంక్షేమం కోసమే చర్చలు జరగాలని వాదోపవాదాలు, వ్యక్తిగత దూషణకు తావివ్వకుండా సభ్యులు ఉండాలన్నారు. ఈ ఐదేళ్ల ప్రజా ప్రస్థానంలో రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, రైతులకు అండగా ఉండేలా, మహిళలకు భద్రతతోపాటు ఉన్నతస్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించేలా, సర్వజనులందరికీ అభివృద్ది చేకూరేలా చర్చలు సాగాలని కోరుకుంటున్నాని పవన్​ కల్యాణ్​ అన్నారు.

తొలిరోజు సందడిగా శాసన సభ - చంద్రబాబు, పవన్​, జగన్​ ఎలా స్పందించారంటే? - AP Assembly Sessions 2024

Last Updated : Jun 22, 2024, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.