ETV Bharat / politics

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ ఫైర్​ - సభ నుంచి బీఆర్​ఎస్​ వాకౌట్ - Danam Nagender fires on BRS MLAs

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:23 PM IST

Danam Nagender on BRS MLAs in Assembly : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట తిరగనివ్వనంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దానం మాటలపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

Danam Nagender on BRS MLAs in Assembly
Danam Nagender on BRS MLAs in Assembly (ETV Bharat)

Danam Nagender Comments on BRS MLAs in Assembly : హైదరాబాద్​లో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ప్రారంభించారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ వ్యాఖ్యలతో శాసనసభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యనంటూ పరుష పదజాలంతో దానం బెదిరింపులకు పాల్పడ్డారు. దానం నాగేందర్​ చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ సభ్యులు తీవ్రంగా స్పందించారు. శాసనసభ స్పీకర్​ పోడియం ముందు ఆందోళనకు దిగారు.

పోడియం దగ్గర నిరసన చేస్తున్న బీఆర్​ఎస్​ సభ్యులవైపు దానం నాగేందర్​ దూసుకెళ్లారు. వెంటనే ఆయనను కాంగ్రెస్​ సభ్యులు వెనక్కి లాగారు. ఆ వెంటనే బీఆర్​ఎస్​ సభ్యులను కేటీఆర్​ తీసుకొచ్చారు. అనంతరం బీఆర్​ఎస్​ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను దానం నాగేందర్​ వెనక్కి తీసుకుంటున్నానని, సభాపతికి క్షమాణలు చెప్పారు. దానం నాగేందర్​ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై బీఆర్​ఎస్​ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ సభ్యులపై పరుష పదజాలం ఉపయోగించిన దానంపై ఆందోళన చేపట్టారు. దానం వ్యాఖ్యలపై నిరసనగా సభ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.