CPI Meeting in Support of Congress MP Candidate Danam Nagender : దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. పదేళ్లు కమలానికి అధికారం ఇస్తే, రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటిని సర్వనాశనం చేశారన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే, ఏక వ్యక్తి నియంత్రణ వస్తుందని ఆయన ఆరోపించారు.
CPM Support to Congress Party : మొన్నటి వరకు 400 సీట్లు వస్తాయి అన్న బీజేపీ ఇప్పుడు నమ్మకం లేక ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సీపీఎం నగర కార్యాలయంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా సీపీఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పుస్తెలతాడు లాక్కుంటారని ప్రధాని నరేంద్ర మోదీ దిగజారుడు మాటలు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి గుండెకాయ వంటిది : ఒక ప్రధాని హోదాలో అలా అనడం తగదు అని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, అటువంటి ఘటనలేం చోటు చేసుకోలేదన్నారు. దేశంలో అంబానీ, అదానీలను మాత్రం అభివృద్ధి చేశారు కానీ, సాధారణ ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని రాఘవులు మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీకి గుండెకాయ వంటిదని, ఇక్కడ కచ్చితంగా కాంగ్రెస్‌ను గెలిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
"అత్యంత గొప్ప చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాద శక్తులకు తప్ప, మతోన్మాద శక్తులకు తోవలేకుండా చేయాలని చెప్పి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో వారు చేస్తున్న ప్రసంగాలు ప్రధానమంత్రి స్థాయికి తగినట్లుగా లేవు. ఇవాళ డబుల్ ఆర్ ట్సాక్స్ అని చెప్పి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. అంతకముందు మంగళసూత్రాలు పోతాయని చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఇటువంటి దిగజారుడు విధానాలు మానుకుంటే మంచిది."-బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
గత పదేళ్లలో బీజేపీ కూటమికి అధికారం ఇస్తే, మతం, కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ దన్ ఖాతా ఓపెన్ చేయమంటే అందరూ ఖాతాలు తెరిచారు. కానీ అకౌంట్ల్లో డబ్బులు రాలేదన్నారు, కానీ పెద్ద నోట్లను మాత్రం రద్దు చేశారని గుర్తుచేశారు. గతంలో బీజేపీ ట్రెండ్ సెట్ చేసేదని, మిగతా వాళ్లు దాన్ని అనుసరించేవారన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ట్రెండ్ సెట్ చేస్తోంటే, మిగిలిన వాళ్లు అనివార్యంగా అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.
Congress MP Candidate Danam Fires on BJP Govt : కమలానికి ఓటేస్తే జలియన్ వాలాబాగ్ వంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే, వేదింపులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎటువంటి కేసులు లేవు కానీ, ప్రతిపక్ష పార్టీలపైన మాత్రం కేసులు పెడుతున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం ఏక తాటికిరావాలి అని పిలుపునిచ్చారు.
"క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం ఉంది. రాజ్యాంగం సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీన్ని కాపాడటానికి మేము కంకణబద్దులమయ్యాము. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా సీపీఎం పెద్దలు వచ్చారు. నా గెలుపునకు దోహదపడతామన్నారు."-దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
కిషన్‌రెడ్డి నువ్వే మూసీ నదిలో పడిపోతావు జాగ్రత్త : బీవీ రాఘవులు