ETV Bharat / politics

ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ - పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్ - ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన

Congress Public Meeting in Indravelli Today : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇంద్రవెల్లి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంఖారావం పూరించనున్నారు. ఇంద్రవెల్లి సభకు తెలంగాణ పునర్నిర్మాణ సభగా కాంగ్రెస్ నామకరణం చేసింది. సర్కార్ కొలువుదీరిన తర్వాత తొలి సభ కావడంతో హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

CM Revanth Reddy
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 7:10 AM IST

నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన

Congress Public Meeting in Indravelli Today : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ, గిరిజన, దళిత దండోరా సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Adilabad District Tour Today : హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మధ్యాహ్నం ఒకటిన్నరకు కేస్లాపూర్‌ చేరుకుంటారు. అక్కడ నాగోబా సన్నిధిలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలో అమరులకు నివాళులర్పిస్తారు. స్మృతివనం పనులకు భూమి పూజ చేసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మరో జలియన్‌వాలాబాగ్‌గా ప్రసిద్ధి పొందిన ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి నివాళులర్పించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావడం విశేషం.

Congress Public Meeting in Indravelli Today : ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అవసరమైన నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కేస్లాపూర్‌ నాగోబా ఆలయం నుంచి ముత్నూర్‌ క్రాస్‌రోడ్డు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి సీఎం నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Congress Indravelli Meeting Today : అటు కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరిన తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణపై దృష్టి సారించింది. ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటానని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జిల్లా ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది.

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం

పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా మార్చుకున్న వారికి రాష్ట్ర అభివృద్ది గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క (Minister Seethakka) మంచిర్యాలలో మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించిన ఆమె కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిక స్థానాలు గెల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ఇంద్రవెల్లి సభతో శంఖారావం పూరించనుంది.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.