ETV Bharat / politics

ఎన్నికల ప్రచారం దృష్టి సారించిన కాంగ్రెస్ - నేడు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Planning On Lok Sabha Election Campaign : రాష్ట్రంలో నాలుగు స్థానాలు మినహా లోక్‌సభ అభ్యర్ధుల ఎంపిక పూర్తికావడంతో ప్రచార కార్యాచరణపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కార్యవర్గ సమవేశం జరగనుంది. కాంగ్రెస్‌ వంద రోజుల పాలన, తుక్కుగూడ సభ, ఎన్నికల వ్యూహాలు, జాతీయ మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రచార కమిటీ సమావేశం కూడా ఇవాళ జరగనుంది.

Congress Manifesto
Congress Planning On Lok Sabha Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 8:04 AM IST

ఎన్నికల ప్రచారం దృష్టి సారించిన కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ

Congress Planning On Lok Sabha Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 14 స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పీసీసీ కార్యవర్గం ఇవాళ సమావేశం అవుతోంది.

గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, విష్ణునాథ్‌ సహా ముఖ్యనేతలు పాల్గొనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. ప్రజాపాలనపై జనం స్పందన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా బీఆర్​ఎస్​ సర్కార్‌లో జరిగిన అక్రమాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలను కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించనున్నట్లు సమాచారం.

నాలుగు స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల - నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - LOK Sabha Elections 2024

Congress Manifesto : లోక్‌సభల్లో పార్టీ బలాబలాలు, విపక్షాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ తీసుకొచ్చిన "పాంచ్‌ న్యాయ్‌'' (Paanch Nyay) గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లే అంశంపై సమాలోచన చేయనున్నారు. లోక్‌సభ ప్రచారాన్ని ఏవిధంగా ఉండాలి? ఎవరెవరు ప్రచారంలో పాల్గొనాలి? సభలు నిర్వహణ వంటి అంశాలను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై పీసీసీ కార్యవర్గం చర్చించనుంది.

PCC Meeting in Gandhi Bhavan : అదే విధంగా పార్టీ, ఇతర పార్టీల బలాబలాలు, ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనేందుకు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి (Congress Joinings) వచ్చిన వారికి ఎందుకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందో కార్యవర్గానికి రేవంత్‌రెడ్డి వివరిస్తారని సమాచారం. 14 లోక్‌సభ స్థానాలు హస్తగతం చేసుకోవడానికి నాయకులు అంతా కలిసికట్టుగా పని చేయాలని కోరనున్నారు. క్షేత్రస్థాయిలో విబేధాలను పరిష్కరించే బాధ్యత సీనియర్‌ నేతలకు అప్పగించే అవకాశం ఉంది.

వీహెచ్‌కు బుజ్జగింపులు - అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్​ ​భరోసా - VH meets CM Revanth Reddy

సీనియర్​ నాయకులు జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో ఏవైనా చిన్న చిన్న విభేధాలు ఉంటే సమసి పోయేందుకు కృషి చేయాలని సూచించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్ర నాయకత్వం రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తుందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి

'ఏప్రిల్​లో తుక్కుగూడలో కాంగ్రెస్‌ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National level meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.