Congress Peddapalli MP Ticket Politics : పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం టిక్కెట్ కోసం భారీ పోటీ నెలకొనగా కాంగ్రెస్ అధిష్ఠానం గడ్డం వంశీకృష్ణకు అవకాశం కల్పించింది. ఈ నియోజకవర్గ పరిధిలోనే వంశీకృష్ణ తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై మంత్రి శ్రీధర్‌బాబు మిగతా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అందుకే అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వంశీకృష్ణకు ఎమ్మెల్యేలు సహకరిస్తారా? అనే అనుమానాలు రేకెత్తాయి. కుమారుడి గెలుపు కోసం రంగంలోకి దిగిన వివేక్ పరిస్థితిని చక్కదిద్దారు. మంత్రి శ్రీధర్‌బాబు సహా ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి ఏకతాటిపైకి తెచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో సమావేశమైన నేతలు ఐక్యత చాటారు.
Pedpadalli Congress Leaders Came Together : తన తండ్రి వెంకటస్వామి సొంత నియోజకవర్గం కావడం, కుమారుడు వంశీకృష్ణను తొలి ఎన్నికల్లోనే గెలిపించాలనే తపనతో వివేక్ చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు వంశీకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ఒకే వేదిక పైకి రావడంతో ఆందోళనకు చెక్ పడినట్లైంది.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం : శ్రీధర్ బాబు - Lok Sabha Election 2024
Congress Focus On Peddapalli Seat : గడ్డం వంశీకృష్ణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే సక్సెక్ కావాలన్న తలంపుతో ఎమ్మెల్యే వివేక్ పావులు కదిపినట్టుగా సమాచారం. తన తండ్రి వెంకటస్వామి సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడి నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు గడ్డం కుటుంబానికన్నా ఎక్కువ బలం, బలగం లేకపోవడం కూడా వివేక్ వెంకటస్వామి ప్రయత్నాలకు కలిసొచ్చింది. వంశీకృష్ణ గెలుపుకోసం తామంతా కలిసి పని చేస్తామంటూ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యుడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మిగతా నేతలు ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి రావడంతో సమరోత్సాహంతో ప్రచారంపై దృష్టిపెట్టారు.
" ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమారుడు వంశీ గెలుపు కోసం కృషి చేస్తాం. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించడానికి ఎమ్మెల్యేలందరం ఏకతాటిపైకి వచ్చాం. పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల ప్రజలు, నాయకులు వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాం." శ్రీధర్‌బాబు, మంత్రి