ETV Bharat / politics

మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి - భారీ మెజార్టీతో గెలిచేందుకు స్పెషల్ ఆపరేషన్ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Master Plan on Malkajgiri : ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్-15 ఆపరేషన్​ పేరుతో 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా వ్యవహరించిన మల్కాజిగిరి లోక్​సభ స్థానంలో, ఎలాగైనా తిరిగి విజయం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

Congress Master Plan on Malkajgiri
Congress Focus on Malkajgiri Constituency
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 1:12 PM IST

Congress Focus on Malkajgiri Constituency : మల్కాజిగిరి, దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం. 37.28 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డిని లక్షకుపైగా భారీ మెజారిటీతో గెలిపించడానికి పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకొని ఓటింగ్‌ శాతం పెంచుకోవాలని వ్యూహాలు రూపొందించారు. పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు.

Congress Master Plan on Malkajgiri : మల్కాజిగిరి లోక్​సభ స్థానానికి చెందిన కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, ఎల్బీనగర్‌ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. వీరితోపాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కాంగ్రెస్‌ నాయకులు తరచుగా సంప్రదింపులు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ నేతలు కాంగ్రెస్​లోకి చేరగా, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ పురపాలికల నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్​గా రంగంలోకి సీఎం రేవంత్​రెడ్డి - lok sabha elections 2024

ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పావనీ యాదవ్‌, మేడ్చల్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌లు ఇటీవల హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా పిర్జాదీగూడ కార్పొరేషన్‌కు చెందిన పదిమంది కార్పొరేటర్లు హస్తంపార్టీలోకి చేరారు. మరోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం ఉపఎన్నికలోనూ విజయమే లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్​నేతలు ఆహ్వానిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జంపన ప్రతాప్‌ను కాంగ్రెస్​లోకి చేర్చుకున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 37.28లక్షల మంది ఓటర్లుండగా, 19.50లక్షల మంది మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల వారే ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరడంతో, బీజేపీకి నష్టం జరిగిందని అనుకుంటున్నారు.

మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని ఓట్లు సాధించాలని భావిస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత రామ్మోహన్‌గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించడంతో, గులాబీ పార్టీ ఓటుబ్యాంక్‌కు గండిపడినట్టేనని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. మరింతమంది బీఆర్ఎస్, బీజేపీ నేతలను చేర్చుకుని భారీ మెజారిటీ సాధించాలని కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha

చేవెళ్ల లోక్​సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.