ETV Bharat / politics

జాతీయ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన అనేక అంశాలు : మంత్రి శ్రీధర్‌ బాబు - Congress National Manifesto 2024 - CONGRESS NATIONAL MANIFESTO 2024

Congress Manifesto Committee Meeting : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో జాతీయ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలను ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ జాతీయ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన అనేక అంశాలు ఉండాలని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

Congress Manifesto Committee Meeting
Congress Manifesto Committee Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 10:29 PM IST

Congress Manifesto Committee Meeting : తెలంగాణకు చెందిన అనేక అంశాలను జాతీయ మేనిఫెస్టో (Congress Manifesto)లో పొందుపరచాలని నిర్ణయించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌, మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశం ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు జానయ్య, జనక్‌ ప్రసాద్‌, రియజుద్దీన్‌, వినోద్‌ కుమార్‌, అనంతుల శ్యామ్‌ మోహన్‌, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాతీయ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాలపై చర్చించినట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే, ప్రధానంగా ప్రాంతీయ ఎయిర్‌ పార్టీలు, వరంగల్‌ ఎయిర్‌ పోర్టు ఆధునికీకరణ, సింగరేణి, రైల్వే, స్పోర్ట్స్‌, యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక స్కూల్స్‌, నవోదయ పాఠశాలలు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అలాగే మేనిఫెస్టో ఇంటింటికీ చేర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని, జనంలోకి వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు!

Telangana Congress Public Meeting In Tukkuguda : లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) కీలకమైన ఐదు అంశాలతో కూడిన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ పార్టీ ఏప్రిల్‌ 6వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభలో ప్రకటించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీటిని వెల్లడించనున్నారు. ఈ భారీ బహిరంగసభ నుంచే కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.

ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా ప్రజలను రప్పించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహరచనలు చేస్తోంది. ఈ సభను పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యే అవకాశం ఉంది.

Five Guarantees of Congress : ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆరు గ్యారంటీల స్కీమ్‌లతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. ఈ ఆరు గ్యారంటీలు ప్రజలకు చేరవై, మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇప్పుడు అదే దారిలో జాతీయ స్థాయిలో అన్ని వర్గాలను మెప్పించడానికి ఐదు గ్యారంటీలతో కూడిన పథకాలను తుక్కుగూడ సభలో ప్రకటించనున్నారు.

ఆ 2 రాష్ట్రాల మోడల్​తో లోక్​సభ బరిలోకి కాంగ్రెస్ - బీజేపీని ఢీకొట్టేందుకు 'పాంచ్​ న్యాయ్​' అస్త్రం

ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ఆరోజే మేనిఫెస్టో ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.