ETV Bharat / politics

ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8500 శిక్షణ భృతి : రాహుల్‌గాంధీ - lok sabha elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 7:31 PM IST

Updated : May 9, 2024, 10:17 PM IST

Rahul Gandhi speech in Saroor Nagar Meeting : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి రాష్ట్రంలోని పేదల వివరాలు సేకరిస్తుందని, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ ధనికులకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టారని, మోదీ ధనికులకు ఇచ్చిన డబ్బును మేము పేద మహిళల ఖాతాల్లో వేయనున్నట్లు పేర్కొన్నారు.

Lok Sabha Elections 2024
Rahul Gandhi speech in Saroor Nagar Meeting (ETV Bharat)

Lok Sabha Elections 2024 : మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంబానీ, అదానీ వంటి వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయం : రాహుల్‌ గాంధీ - lok sabha elections 2024

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి రాష్ట్రంలోని పేదల వివరాలు సేకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ ధనికులకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టారని, మోదీ ధనికులకు ఇచ్చిన డబ్బును మేము పేద మహిళల ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రైతురుణమాఫీ, మద్దతు ధర అనే రెండు ప్రధాన హామీలు ఉన్నాయని గుర్తు చేశారు.

పట్టభద్రులు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు నైపుణ్య శిక్షణ కల్పిస్తామని, రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8500 శిక్షణ భృతి ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఇచ్చే రోజువారీ కూలీని రూ.400కు పెంచుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తోందని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.

దేశ రాజ్యాంగాన్ని మర్చడానికి బీజేపీ కుట్రపన్నిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో సంపన్న వర్గాలకు మేలు జరిగిందని, సామాన్య ప్రజల సంక్షేమంపై దృష్టిసారించలేదని పేర్కొన్నారు. నేడు రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచనని తెలిపారు.

"పట్టభద్రులు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు నైపుణ్య శిక్షణ కల్పిస్తాము. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8500 శిక్షణ భృతి ఇస్తాము. ఉపాధి హామీ పథకంలో ఇచ్చే రోజువారీ కూలీని రూ.400కు పెంచుతాము. మహిళలకు రూ. లక్షను బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తాము". - రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8500 శిక్షణ భృతి : రాహుల్‌గాంధీ (ETV BHARAT)

'అంబానీ-అదానీ నుంచి రాహుల్​కు డబ్బు ట్రక్కులు'- మోదీ వ్యాఖ్యలపై గాంధీ ఫైర్​ - Rahul Gandhi On PM Modi

అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగాన్ని మోదీ చించేయాలని చూస్తున్నారు : రాహుల్​ గాంధీ - Rahul Gandhi Election Campaign

Last Updated : May 9, 2024, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.