Congress Leader VH Fire on Cm Revanth : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్(BRS)పీడ పోయిందన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆ పార్టీ వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడినా ఎవరూ సీఎం కాలేదని, కానీ ఆయన నాలుగేళ్లల్లో సీఎం అయ్యారని రేవంత్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.
రేవంత్(CM Revanth Reddy) పార్టీని బలోపేతం చేశారన్న వీహెచ్, బీఆర్‌ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టి, బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బయట పైసలు సంపాదించినోళ్లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న ఆయన, ఎందుకో అర్థం చేసుకోవాలని రెండు వైపులా విని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎంలో మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
Few Leaders Joined in Congress Party : ఇటీవలే బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ సిట్టింగ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ సీటింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender), వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు హస్తం కండువా కప్పుకున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
'జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రికి పలుమార్లు చెబుదామని ప్రయత్నించా. గత పదేళ్లలో బీఆర్ఎస్ మాపై పెట్టిన కేసులను తొలగించాలని చెప్పాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోచుకుందని, దాని పీడ పోయిందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇవాళ ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లకు రెండు, మూడు టికెట్లా?. పార్టీ కార్యకర్తలు బాధ పడుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయొద్దని కోరుతున్నా.'-వి.హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు
సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate