Congress Leader Jagga Reddy Fires on BJP And BRS : సోనియాగాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబమని, వారు దేశం కోసం చేసిన త్యాగాలు మరెవరూ చేయలేదన్నారు. ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయ పాత్రలాంటిదన్నారు. సోనియా గాంధీ యూపీఏ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. మోదీ వచ్చిన తర్వాత అనవసరమైన నిబంధనలు పెట్టి పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజలకు శాపంగా మారారని, పీవీ నరసింహారావుని ప్రధానమంత్రిని చేసింది సోనియాగాంధే అని పేర్కొన్నారు.
"గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడల్లా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ నిధులు కూడా నిరుపేదలకు అందే విధంగా పథకాలను తీసుకువచ్చారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం దేశంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అక్షయ పాత్రలా ఉంది. కేటీఆర్ దమ్ములేని అభ్యర్థులను ఎందుకు ఎన్నికల్లో నిల్చోబెట్టావు. అధికారం కోల్పోయి, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వీరితో పాటు హరీశ్ రావు ముగ్గురు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. మహిళలు పథకాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తెలుసుకొని మాకు చెప్పండి." - జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారు : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth on Modi and KCR
సోనియా 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరించారని, ప్రధాని కావాలనుకుంటే ఆమె రెండు పర్యాయాలు అయ్యేవారని వివరించారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు స్క్రిప్ట్ రాసిస్తే కిషన్ రెడ్డి చదువుతారని, ఆయన స్క్రిప్ట్ లీడర్ అని ఎద్దేవా చేశారు. వారికి హిందూ సంప్రదాయం గురించి తెలియదని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులందరూ డమ్మిలేనని విమర్శించారు. ఎల్ కే అద్వానీ భిక్షతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పారు. ఈ ముగ్గురు ఆర్టీసీ బస్సులు ఎక్కి పథకాల గురించి మహిళలను అడిగి చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దమ్ములేని వ్యక్తులను పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్లో చేరాలంటే - ఇక ఆ కమిటీ ఆమోదం తప్పనిసరి - T CONGRESS JOININGS COMMITTEE