ETV Bharat / politics

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు - బీజేపీ, బీఆర్ఎస్ పదేళ్లుగా చేసిందేం లేదంటూ ప్రచారం - Congress Election Campaign - CONGRESS ELECTION CAMPAIGN

Congress Election Campaign In Telangana : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఉదయపు నడకలో పాల్గొని కాంగ్రెస్​కు ఓటేసి గెలిపించాలని వాకర్స్​ను కోరుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Congress Election Campaign
Congress Election Campaign In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 1:56 PM IST

Congress Election Campaign In Telangana : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్ నేతలతో కలిసి ఉదయపు నడకలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వాకర్స్‌ను అభ్యర్థించారు. పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని తెలిపారు.

రాబోయే రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్​గా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించడంతో పాటు, హుస్నాబాద్​లోని ఎల్లమ్మ చెరువు, మహాసముద్రం గండిలను టూరిజం క్లస్టర్ కింద అభివృద్ధి చేస్తామన్నారు. తనను ఆశీర్వదించినట్లే, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపిస్తే మరింత శక్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్​ రెడ్డి - Revanth Campaign in Adilabad

చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి కార్నర్ మీటింగ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి యాదగిరి గుట్టలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలలో 5 అమలు చేశామని త్వరలోనే రూ. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

పేదవాళ్లకు న్యాయం చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కారు ఇంజన్ పాడైపోయిందని అది షెడ్డుకే పరిమితమన్నారు. మద్యం కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్లిందని భవిష్యత్తులో మరి కొంత మంది వెళ్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చామల కిరణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య, మునుగోడు ఎమ్మెల్యే రాజ్​గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

MLA Makkan Singh Raj Thakur Campaign : బీజేపీ గెలిస్తే దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో మార్నింగ్ వాకర్స్​ను కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రామగుండంను బొందల గడ్డగా చేసిన కేసీఆర్ గోదావరిఖని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని వాకర్స్​కి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం - ఓట్ల వేటలో అభ్యర్థుల మాటల తూటాలు - Lok Sabha Elections 2024

బీజేపీ, బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు - పదేళ్లుగా ప్రజలకు చేసిందేం లేదంటూ ప్రచారం - Congress Election Campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.