ETV Bharat / politics

టార్గెట్ @ 15 - ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్ - LOK SABHA POLLS 2024 - LOK SABHA POLLS 2024

Congress Election Campaign In Telangana : 15 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆరుగ్యారెంటీల అమలును వివరిస్తూ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Congress Election Campaign In Telangana
Congress Election Campaign In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 9:04 AM IST

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం

Congress Election Campaign In Telangana : లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. సార్వత్రిక సమరంలో అత్యధిక లోక్‌సభ ఎంపీలు గెలుచుకునే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ముఖ్యనేతలు, నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోపై ప్రజలకు(people) అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసిన మంత్రి శ్రీధర్‌బాబు స్థానికులతో మాట్లాడారు.

Minister Sridhar Babu Fires On BJP : అనంతరం పెద్దపల్లిలో పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో(meeting) పాల్గొన్న మంత్రి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాంచ్‌ న్యాయ్‌లో భాగంగా స్వామినాథన్‌ సిఫారసులు అమలుచేస్తామని తెలిపారు. మోదీ సర్కార్‌ పదేళ్లలో రైతులకు చేసిందేమి లేదని విమర్శించారు. రైతులు(Farmers) చేసిన ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో అణచివేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha

Congress Party Speedup Election Campaign : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో పార్టీ బూత్‌ స్థాయి కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలు కాలనీల్లో రంజిత్‌రెడ్డి ప్రచారం(Election Campaign) నిర్వహించారు. మన్నెగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలుచేయని బీఆర్ఎస్​కు కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.

"రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ఈ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా ఉండటం గర్వకారణం. నన్ను ఎంపీగా గెలిపిస్తే షాద్​నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు సాగునీటిని అందించి రైతుల అభివృద్ధికి కృషిచేస్తాను" - చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్ - LOK SABHA ELECTIONS 2024

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.