ETV Bharat / politics

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం - అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి మంత్రులు - Congress Election Campaign

Congress Election Campaign in Telangana 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు సమయం సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్థులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేం లేదంటూ అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు.

Minister Sridhar Babu Election Campaign
Congress Election Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 11:35 AM IST

Congress Election Campaign in Telangana : లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. సార్వత్రిక సమరంలో అత్యధిక లోక్‌సభ ఎంపీలు గెలుచుకునే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కార్మికులకు ఏం చేయకుండా ఓటు అడిగే నైతికహక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్ధపల్లి జిల్లా రామగిరి మండలం ఒసిపి 2 బొగ్గు ఉపరితలగని గేట్ మీటింగ్​లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణతో కలసి పాల్గొన్నారు.

Minister Sridhar Babu Election Campaign In Peddapalli : ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఆదాయపు పన్ను స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, అందుకే ఆయనకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి కార్మికులను కోరారు.

అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్​ నేతల విస్తృత ప్రచారం - ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు - congress campaign in Telangana

Minister Seethakka Election campaign : మరోవైపు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మంత్రి సీతక్క ఎండను లెక్కచేయకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు సంక్షేమ పథకాలను అందేలా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఎన్నికలలో ప్రచారంలో భాగంగా కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో సీతక్క ప్రచారం నిర్వహించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో నియోజకవర్గ ఇంఛార్జ్ రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు - పదేళ్లుగా ప్రజలకు చేసిందేం లేదంటూ ప్రచారం - Congress Election Campaign

జెట్ స్పీడ్​లో సీఎం రేవంత్ ప్రచారం - నేడు కొడంగల్, నాగర్​కర్నూల్​లో సభలు - CM REVANTH CAMPAIGN SCHEDULE TODAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.