ETV Bharat / politics

కాంగ్రెస్ తొలి విజయం - ఖమ్మంలో 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన రఘురాంరెడ్డి - Khammam Lok Sabha Seat Winner - KHAMMAM LOK SABHA SEAT WINNER

Congress Wins Khammam Lok Sabha Election 2024 : లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొల్పే స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగింది. చివరికి కాంగ్రెస్​ తన సత్తాను చాటుకుంటూ గెలుపు జెండాను ఎగురవేసింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి రామసహాయం రఘురాంరెడ్డిని రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆయన 3.5 లక్షల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

Lok Sabha Election Result 2024
Congress Won Khammam Lok Sabha Seat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 1:05 PM IST

Raghuram Reddy Wins Khammam Lok Sabha Election 2024 : రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. చివరకు 3.5 లక్షల భారీ మెజార్టీతో ఆయన ఈ ఎన్నికలో విజయం సాధించారు. మొదటి నుంచి ముందంజలో నిలిచిన ఆయన ఖమ్మం సీటును కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపాలా అని ఎన్నో రోజులు మల్లగుల్లాలు పడింది. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​ మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. చివరికి పంచాయతీ దిల్లీ వరకు చేరుకుంది. ఆఖరి క్షణంలో హస్తం పార్టీ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేసింది.

Congress Wins Khammam Lok Sabha Seat : ప్రధాన పార్టీ ప్రముఖ నాయకులందరూ ప్రచారంలో హోరెత్తించారు. ఖమ్మంపై పాగా వేస్తామని బీజేపీ అంటే, మరోసారి గెలిచేది మేమే అంటూ బీఆర్ఎస్ పాట పాడింది. ఇక కాంగ్రెస్ మాత్రం లేటుగా అభ్యర్థిని ప్రకటించినా లేటెస్టుగా ప్రచారాన్ని హోరెత్తించింది. మొత్తం ఈ లోక్​సభ స్థానం నుంచి 51 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల కౌంటింగ్​లో మాత్రం కాస్త ఉత్కంఠ తగ్గింది. మొదటి రౌండ్​ నుంచే హస్తం పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ వచ్చారు. చివరికి అధిక మెజారిటీతో గెలుపొందారు.

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యం

Khammam Lok Sabha Seat History : ఖమ్మం లోక్‌సభ స్థానంలో 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 12 సార్లు గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్​ తరఫున పోటీ చేసిన నామ నాగేశ్వరరావు 2019 ఎన్నికలతో పాటు 2009 ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచారు.

Lok Sabha Election Result : 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపొందడంతో హస్తం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట అని మరోసారి రుజువైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషితో జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ప్రచారంలో పలుమార్లు ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థి గెలవడంతో కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

ఎన్నికల నామినేషన్ల సందడి - ఉమ్మడి ఖమ్మం నుంచి బరిలో 76 మంది - KHAMMAM CANDIDATEs NOMINATION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.