Competition For Medak MP Ticket in BRS : మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్‌కు కంచుకోట. 2004 నుంచి 2019 వరకు గులాబీ పార్టీనే ఇక్కడ విజయం సాధిస్తోంది. టికెట్ దక్కించుకుంటే చాలు తమ గెలుపు ఖాయమనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఉంటుంది. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి గెలుపొందింది. మెదక్‌లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. సిద్దిపేటలో 83,000లు, గజ్వేల్లో 45,0000లు, దుబ్బాకలో 53,000ల ఓట్ల ఆధిక్యం బీఆర్ఎస్‌కు దక్కింది.
కారు గుర్తుపై వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎ బీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ టికెట్ కోసం (BRS MP Ticket ) కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల సమయంలో నర్సాపూర్ స్థానాన్ని సునీత లక్ష్మారెడ్డికి వదులుకున్నందుకు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చే అంశంపై ఊసే లేదని మదన్‌రెడ్డి వర్గం ఆందోళనలో ఉంది.
కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్‌రావు
BRS Focus on Lok Sabha Elections 2024 : మెదక్ నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వినిపించింది. సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో ఉంటారన్న ప్రచారమూ జరిగింది. కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఆయన వ్యవహారశైలీపై మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ భూ నిర్వాసితులు కోపంతో ఉన్నారని సమాచారం. ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని బరిలో దింపింతే పార్టీ నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
BRS MP Ticket Fight 2024 : మెదక్ సీటు కోసం వంటేరు ప్రతాప్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్ పోటీ పడుతున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన గజ్వేల్ బాధ్యతలు చూసుకున్నారు. ఇక గాలి అనిల్‌కుమార్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరారు. గతంలో ఆయన గులాబీ పార్టీలోనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం తిరిగి సొంత గూటికి చేరుకుని ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.
తీవ్ర ఉత్కంఠగా మారిన మెదక్ ఎంపీ స్థానం : మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తనకు అవకాశం ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ని కలిసినట్లు సమాచారం. తమకే టికెట్ వస్తుందని అనుచరుల వద్ద ఆశావహ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది. మెదక్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందనే అంశం పార్టీ వర్గాల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది.
త్వరలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్ పోటీపై ఇదే క్లారిటీ
నిజామాబాద్ లోక్‌సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?