ETV Bharat / politics

మే మొదటివారంలో రాష్ట్రానికి ప్రియాంక - మిర్యాలగూడ, చౌట్‌ప్పల్​లో భారీ బహిరంగ సభలు - lok sabha elections 2024

CM Revanth Review on Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 21న ఆయన నామినేషన్‌ వేస్తారని, అదే రోజు భువనగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 2:54 PM IST

Updated : Apr 10, 2024, 7:32 PM IST

CM Revanth reddy
CM Review on Bhuvanagiri Lok Sabha Constituency

CM Revanth Review on Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరి పార్లమెంట్‌లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగామ అసెంబ్లీ ఇంఛార్జీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వకర్తలు పాల్గొన్నారు.

కొడంగల్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కుట్ర - నాపై కక్షగట్టి దుష్ప్రచారం : సీఎం రేవంత్

ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ జన సమీకరణతో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజున సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నామినేషన్ కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మే మొదటి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, చౌట్‌ప్పల్‌ రెండు చోట్ల నిర్వహించనున్న భారీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాల్లో గెలవనున్నట్లు పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి, భువనగిరిలో మెజార్టీ 2 లక్షలకు తక్కువ కాకుండా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భువనగిరిలో అభ్యర్థి చామల గెలుపు బాధ్యత రాజగోపాల్‌ రెడ్డిదేనని సీఎం అన్నారు.

చర్లపల్లి జైల్​లో డబుల్​బెడ్ రూం ఇల్లు కట్టిస్తా - కేసీఆర్​కు, సీఎం రేవంత్​రెడ్డి మాస్ వార్నింగ్

టార్గెట్‌ 14 మిస్సవ్వొద్దు : ఈసారి పార్లమెంట్​ ఎన్నికల్లో 14 సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్​ పార్టీ, ఆ దిశగా తన వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతోంది. బీఆర్​ఎస్​, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా, ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలను మేల్కొలుపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే విధంగా సీఎం రేవంత్​ రెడ్డి అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, చామల కిరణ్‌ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కూన శ్రీశైలం గౌడ్ ​- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

Last Updated : Apr 10, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.