CM Revanth Reddy Speech at Palamuru Praja Deevena Sabha : పదవులు శాశ్వతం కావు కార్యకర్తలే కాంగ్రెస్‌కు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అప్పట్లో పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును దివంగత ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. తాను తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయట్లేదని అన్నారు. పాలమూరులో నిర్వహించిన ప్రజా దీవెన సభ(Praja Deevena Sabha)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి వంశీచందర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎందుకు నీకు, ఈ రాజకీయాలని చాలా మంది నాతో అప్పుడు అన్నారని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. మొదటిసారి జడ్పీటీసీగా నన్ను పాలమూరు ప్రజలు గెలిపించారన్నారు. మా తాతలు, ముత్తాతలు సీఎంలు కాదు, నాకు కోట్ల రూపాయలు ఇవ్వలేదని తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వివరించారు. నా పూర్వీకులు రాజకీయ నాయకులు, సీఎంలు కాదని తెలిపారు.
"మీరే నన్ను 2007లో ఎమ్మెల్యే చేశారు. 2014లో నన్ను మళ్లీ గెలిపించారు. మల్కాజ్గిరి గెలుపుతోనే సోనియాగాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేసింది. రాష్ట్ర అభివృద్ధిపై సభా ముఖంగా పీఎంను నిలదీశాను. ప్రధానికి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. నేను గదిలో వినతిపత్రం ఇవ్వలేదు, నిండు సభలో అడిగాను. అతిథి మన రాష్ట్రానికి వస్తే గౌరవించడం మన ఆచారం. విజ్ఞతతో కూడని వినతిపత్రాలు దేశ ప్రధానికి ఇచ్చా." - రేవంత్ రెడ్డి, సీఎం
CM Revanth Reddy Meeting in Palamuru : బీఆర్ఎస్(BRS) అంటే బిల్లా, రంగా సమితి అని హరీశ్‌రావు, కేటీఆర్‌ను చూస్తే బీఆర్ఎస్ బిల్లా, రంగా సమితి అనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ విమర్శించారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని మోదీతోనైనా, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతానని మాటిచ్చారు. పాలమూరును అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత నాది అని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించేందుకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారన్నారు.
"2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు చొప్పున ఈ రాష్ట్రాన్ని పాలించాయి. కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి తీరాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర నా చేతిలోనే ఉంది. కేడీ, మోదీ కలిసి ఎస్సీలకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపించేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దు. పాలమూర-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా ప్రధాని మోదీ తన హామీని నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాని బీజేపీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదు." - రేవంత్ రెడ్డి, సీఎం
ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి