CM Revanth On PM Modi Comments : గత పదేళ్లలో నెలకొన్న చీకటి, నిరాశను తాము గత 11 నెలల్లో పారదోలామని, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సూర్యుడిలా ఉదయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై స్పందించిన సీఎం, ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ : ఏడాది కూడా కాకముందే దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ అమలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, 22 లక్షల మందికి పైగా రైతులకు రూ.2 లక్షల వరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, కేవలం 25 రోజుల్లోనే జమ చేసినట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నందుకు మహిళలు తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధిక గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతుంటే, తెలంగాణలో రూ.500 సిలిండర్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Dear Shri @narendramodi Ji
— Revanth Reddy (@revanth_anumula) November 2, 2024
I am happy to clarify several misconceptions and factual errors in your statements about my state and our government.
In #Telangana since December 7, 2023, when the congress government took oath, a wave of joy & hope has swept the state, after a…
ఉద్యోగ నియామకాలు : దశాబ్ద కాలం పాటు పరీక్షలు, ఉద్యోగాల నియామకాల్లో విఫలమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు గ్రూప్స్ పరీక్షలను రెగ్యులర్గా నిర్వహిస్తోందని తెలిపారు. 11 నెలలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది రికార్డ్ అని స్పష్టం చేశారు.
ప్రజలకు తామిచ్చిన ప్రతి వాగ్ధానం పవిత్రతో కూడిన నిబద్ధత : గతంలో విస్మరించిన మూసీ నదిని పరిశుభ్రం చేయడంతో పాటు పునరుద్దరణ చేస్తున్నామని, గత పదేళ్లుగా ధ్వంసం చేసిన, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, నీటి వనరులను సంరక్షిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్న సీఎం, అందుకోసం మాస్టర్ ప్లాన్ ఖరారవుతోందని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ప్రతి వాగ్ధానం తమకు పవిత్రతో కూడిన నిబద్ధత అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో అకస్మాత్తుగా భారీ మార్పులు!
'మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం - మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా!'