ETV Bharat / politics

కొడంగల్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కుట్ర - నాపై కక్షగట్టి దుష్ప్రచారం : సీఎం రేవంత్ - LOK SABHA ELECTION 2024 - LOK SABHA ELECTION 2024

CM Revanth Reddy Kodangal Tour : లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను ఎందుకు ఓడించాలో రేవంత్​ రెడ్డిని ఎందుకు కింద పడేయాలో చెప్పాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. సోమవారం కొడంగల్​లో పర్యటించిన సీఎం, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Kodangal Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 7:17 AM IST

కొడంగల్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కుట్ర - నాపై కక్షగట్టి దుష్ప్రచారం : సీఎం రేవంత్

CM Revanth Reddy Kodangal Tour : లోక్​సభ ఎన్నికల్లో కొడంగల్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసి, తన గౌరవాన్ని తగ్గించేందుకు కొందరు కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ను ఎందుకు ఓడించాలో రేవంత్​ రెడ్డి(CM Revanth Questions BRS and BJP)ని ఎందుకు కింద పడేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమవారం కొడంగల్​లో పర్యటించిన సీఎం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 50 వేల అధిక్యంతో కాంగ్రెస్​ను గెలిపించి కొడంగల్​పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

మధ్యాహ్నం కొడంగల్​లోని తన నివాసానికి సీఎం చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చల్లావంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌తో కలిసి లోక్​సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

"రేవంత్​ రెడ్డి పరపతిని ఎట్లా అయిన తగ్గించాలని విపక్షాలు చూస్తున్నాయి. అందుకు కొడంగల్​లో మెజార్టీ అయిన తగ్గించి రేవంత్​ రెడ్డిని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది రేవంత్​ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్​ ప్రతిష్ఠను దెబ్బతీయడం. కొడంగల్​ అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. మెడికల్​ కాలేజీ తెచ్చినందుకు రేవంత్​ రెడ్డిని కింద పడేయాలా? కరవు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్​ ప్రాంతాన్ని రూ.4000 కోట్లతో నారాయణపేట్​-కొడంగల్​ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకుని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్​ రెడ్డిని కిందపడేయాలా?" - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి​పై డీకే అరుణ సీరియస్​ - ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్​

CM Revanth Slams PM Modi : పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీకి మరోసారి ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అంటూ సీఎం రేవంత్​ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లలో మోదీ సర్కారు పాలమూరుకు చేసిందేమిటో ఒకసారి చెప్పాలన్నారు. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన డీకే అరుణ జిల్లా ప్రజలకు చేసిందేంలేదని విమర్శించారు. బీజేపీ చేరినందుకు ఆమె ఏమైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు(Palamuru - Ranga Reddy Project) జాతీయ హోదా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు.

కొడంగల్​ 50 వేల మెజారిటీ ఇచ్చి చల్లా వంశీచంద్​ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రజలను కోరారు. దిల్లీలో సైనికునిలా పనిచేస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చేందుకు కొట్లాడతానని చెప్పారు. కొడంగల్​ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు.

"కొడంగల్​ నియోజకవర్గంలో 50 వేల మెజారిటీ తగ్గకుండా వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే మీ సిఫాయిలా దిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వచ్చేలా పార్లమెంటులో కొట్లాడతాడు. అవసరమైతే ప్రధానితో సైతం వైరానికి సిద్ధంగా ఉంటాడు. రాహుల్​ గాంధీ ప్రధాని అయితే వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. కొడంగల్​ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

పేలిన కారు టైరు - సీఎం రేవంత్​ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

చర్లపల్లి జైల్​లో డబుల్​బెడ్ రూం ఇల్లు కట్టిస్తా - కేసీఆర్​కు, సీఎం రేవంత్​రెడ్డి మాస్ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.