ETV Bharat / politics

జెట్ స్పీడ్​లో సీఎం రేవంత్ ప్రచారం - నేడు కొడంగల్, నాగర్​కర్నూల్​లో సభలు - CM REVANTH CAMPAIGN SCHEDULE TODAY

CM Revanth Reddy Election Campaign 2024 : నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం సర్వం సిద్దం చేసుకుంటోంది. ఏఐసీసీ మేనిఫెస్టోతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అమలుచేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బ్రోచర్లు, కరపత్రాలు పెద్ద ఎత్తున పంచేందుకు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల నేతృత్వంలో వీటిని బూత్‌స్థాయి నుంచి ఇంటింటికి అందేలా చూడాలని పీసీసీ నిర్ణయించింది.

Congress Campaign Six Guarantees
Telangana Congress Election Campaign 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 7:40 AM IST

జెట్ స్పీడ్​లో రేవంత్ ప్రచారం - నేడు కొడంగల్, నాగర్​కర్నూల్​లో సభలు

Congress Election Campaign 2024 : లోక్​సభ ఎన్నికలకు అభ్యర్ధుల నామినేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. ఇప్పటికే దాదాపు అభ్యర్ధులు అంతా నామపత్రాల క్రతువు ముగించారు. కొందరు ఒరిజినల్‌ సెట్లు మరికొందరు అదనపు సెట్లు వేశారు. అభ్యర్థులు ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. ఏ అంశాలను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాలి, ప్రభావం చూపే స్థానిక నాయకులు ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇంఛార్జ్‌ మంత్రులు, సీనియర్‌ నాయకులు ఇప్పటికే నియోజకవర్గాలల్లోనే మకాం వేసి అభ్యర్ధులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రచార సామాగ్రితో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Congress Campaign Six Guarantees : ఐదు గ్యారంటీలు, అధికారంలోకి వచ్చాక అమలవుతున్న వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు తదితర అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలు చేస్తామన్న సీఎం ప్రకటన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని పీసీసీ యోచిస్తోంది.

లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్‌ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees

ప్రచారాస్త్రాలుగా ఆరు గ్యారంటీలు : ఐదు గ్యారంటీలు, నాలుగు నెలల్లోనే 30వేల ఉద్యోగాల భర్తీ, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ధరణి సమస్యల పరిష్కారం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ వచ్చింది కరువు తెచ్చిందనే రీతిలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పి కొట్టేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం : వర్షాభావ పరిస్థితులతోనే నీటివనరులు అడుగంటాయని అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడం, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్కార్‌ తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు వివరించనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు లోకసభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేస్తారు. నేడు కొడంగల్, నాగర్ కర్నూల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 24న సికింద్రాబాద్‌, వరంగల్‌లో పర్యటిస్తారు. 25న చేవెళ్ల, 26న జహీరాబాద్ ప్రచారసభల్లో పాల్గొంటారు.

ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ - బెంగళూరుకు చేరిన పంచాయితీ - Khammam Congress MP Candidate Issue

ఓటర్ల నాడి మారుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళన - 15 ఎంపీ స్థానాలు సాధ్యమయ్యేనా? - Congress Focus On 15 MP Seats

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.