ETV Bharat / politics

400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Modi and KCR

CM Revanth on BJP and BRS : కేసీఆర్‌, మోదీ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్​ ఎప్పుడైనా రైతులతో మాట్లాడారా కనీసం పంటలైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. ఇవాళ చేవెళ్లలో కాంగ్రెస్​ నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్న సీఎం బీజేపీ, బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

CM Revanth Reddy Fire On Modi
CM Revanth on BJP and BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 8:49 PM IST

Updated : Apr 25, 2024, 10:34 PM IST

CM Revanth Reddy Fire On Modi : కేసీఆర్‌, మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారని, అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. డిసెంబర్‌ 3న కారును షెడ్డు పంపించారని, షెడ్డుకు పోయిన కారు తుప్పుపట్టి పోయిందని ఎద్దేవా చేశారు. అది ఇక రాదని, కారు తుప్పుపట్టి పోయినందుకే బస్సు వేసుకుని బయలుదేరారని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు కేసీఆర్‌ వైఖరి ఉందని, ఆయన పదేళ్ల పాటు ఎప్పుడైనా ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకు వచ్చారా అని ప్రశ్నించారు.

పదేళ్లలో ఎప్పుడైనా కేసీఆర్​ బయటికి వచ్చి, రైతులతో మాట్లాడారా ? పంటలను పరిశీలించారా ? అని సీఎం రేవంత్​ మండిపడ్డారు. నాలుగు గంటలు టీవీలో మాట్లాడిన బీఆర్​ఎస్​ అధినేత అసెంబ్లీకి వచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచుతానన్న మోదీ, వారికి ఖర్చులు పెంచారని ​విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతుల ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు. అందరూ జన్‌ధన్‌ ఖాతాలు తెరవండని, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ అన్నారని, ఈ పదేళ్లలో ఎవరి ఖాతాలోనైనా ఆయన రూ.15 లక్షలు వేశారా అని ప్రశ్నించారు.

CM Revanth on RSS and BJP : రాష్ట్రానికి కాంగ్రెస్‌ ఇచ్చిన వాటిని కూడా మోదీ సర్కార్‌ రద్దు చేసిందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు వస్తే, రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో మూడొంతుల మెజార్టీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేయటమే ఆ పార్టీ అజెండా అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు, అజెండానే మోదీ సర్కారు అమలు చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో ఉందని, దాన్ని అమలు చేయడమే బీజేపీ లక్ష్యమని ఉద్ఘాటించారు.

మోదీ, బీజేపీ ప్రభుత్వానిది బ్రిటీషర్ల విధానమని, చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే బీజేపీ నేతలు దేవుడి నినాదం ఎత్తుకున్నారని సీఎం రేవంత్​ ఎద్దేవా చేశారు. తరతరాలుగా దేవుడిని పూజిస్తున్నామని, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతిని బీజేపీ వాళ్లే కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శంచారు. ఓట్ల కోసమే దేవుడిని వాడుకునే బీజేపీకి గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్​ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్​కు మద్దుతుగా సీఎం రేవంత్​ కంటోన్మెంట్‌లోని రోడ్​షోలో పాల్గొని ప్రసంగించారు. కంటోన్మెంట్‌లో స్కూళ్లకు వెళ్లడానికి కూడా దారిలేకుండా చేశారని, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని సీఎం రేవంత్​ తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి కోరారు.

'వ్యాపారం ముసుగులో ఈస్టిండియా కంపెనీ మొదట సూరత్‌ నుంచే ఆక్రమణ ప్రారంభించింది. మోదీ, అమిత్‌ షా కూడా సూరత్‌ నుంచే వచ్చారు. గుడిలో ఉండే దేవుడిని బీజేపీ నేతలు గోడల మీదకు తెచ్చారు'-రేవంత్​ రెడ్డి, సీఎం

400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్​ రెడ్డి

హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో - కేసీఆర్​లాగా మాట తప్పొద్దు : రేవంత్​ రెడ్డి - Revanth Reddy Speech in Warangal

Last Updated : Apr 25, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.