CM Revanth On Local Body Elections : రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన, పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
గడిచిన పదేళ్ల కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పినట్లు వివరించారు. ప్రజల సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక పాటిస్తుందన్న ఆయన, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా నిచ్చారు.
Revanth Reddy on Party Activists Opportunities : తాను నాయకుడిని కాదని, కార్యకర్తల్లో ఒకడిగా భావించే వ్యక్తినని పేర్కొన్నారు. కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో కష్టపడిన వారికే అవకాశాలు దక్కుతాయని తెలిపారు. తనకు వచ్చిన పదవి కార్యకర్తల కష్టం, త్యాగాల వల్ల వచ్చిందని ఉద్ఘాటించారు.
తనవరకు వస్తే కానీ, కేసీఆర్‌కు ఆ బాధ తెలియలేదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటున్నారని మాట్లాడుతున్న కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నప్పుడు ఆయన రాజనీతి ఏమైందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తన వరకు వస్తే కాని కేసీఆర్‌కు ఆ బాధ తెలియలేదా అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులలోనే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా అని రేవంత్ ప్రశ్నించారు.
"ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోలేదా? ఈ ప్రభుత్వం నెల రోజులకే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేశాయి. తనవరకు వస్తే కానీ, కేసీఆర్‌కు ఆ బాధ తెలియలేదు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Fires on KCR : పార్టీ బలహీనపడినప్పుడల్లా కేసీఆర్, విద్యార్థుల భావోద్వేగాలతో శవరాజకీయం చేసి పార్టీ నిర్మించుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. కోచింగ్ సెంటర్ల మాఫియా వందల కోట్లు కొల్లగొట్టేందుకు పరీక్షల వాయిదా పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. పరీక్షలు వాయిదావేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్, హరీశ్‌రావులు ఆమరణ దీక్షకు కూర్చోవాలని సవాల్ విసిరారు.
డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH ON DSC EXAMS