ETV Bharat / politics

సిద్ధం సభల కోసం వైసీపీ వందల కోట్ల వ్యయం- అధికార దుర్వినియోగంపై విమర్శల వెల్లువ - CM Jagan Siddham Meeting

సిద్ధం సభల పేరిట ప్రజల్ని ఇబ్బందిపెడుతూ వారిపై యుద్ధం చేస్తున్న వైసీపీ సభల కోసం వందల కోట్లు వెచ్చిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలా కాకుండా ఏదో 'ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌'లా సాగుతోందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం సభనూ వైసీపీ అంతే ఆడంబరంగా నిర్వహించింది. ఇందుకోసం అధికార దుర్వినియోగానికీ ఏమాత్రం వెనకాడటం లేదు.

CM_Jagan_Siddham_Meeting_in_Medarametla
CM_Jagan_Siddham_Meeting_in_Medarametla
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 9:07 AM IST

సిద్ధం సభల కోసం వైసీపీ వందల కోట్ల వ్యయం- అధికార దుర్వినియోగంపై విమర్శల వెల్లువ

CM Jagan Siddham Meeting in Medarametla: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వంటి జాతీయ స్థాయి నాయకులు పాల్గొనే సభలకూ ఇంత ఖర్చు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. వైసీపీ వంటి ఒక ప్రాంతీయ పార్టీ కేవలం నాలుగు సభలకే వందల కోట్లు ఖర్చు చేసిందంటే ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? జగన్‌ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల మాత్రమే కాదు ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు వేస్తున్న ప్రశ్న అదే. ఈ అయిదేళ్లలో ప్రభుత్వ పెద్దలు దోచుకున్న వేల కోట్లను ఇప్పుడు ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆ సభలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

భారీ సెట్టింగ్‌లు, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల పేరుతో అత్యంత ఆడంబరంగా చేస్తున్న పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల మాదిరిగానే వైసీపీ సిద్ధం సభలూ జరుగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీఎం జగన్, వైసీపీ నేతలు కూర్చునేందుకు భారీ వేదిక, ప్రధాన వేదికపై నుంచి ప్రజల మధ్యకు జగన్‌ ర్యాంప్‌ వాక్‌ చేయడానికి వీలుగా దానికి అనుసంధానంగా 'వై' ఆకారంలో మరో వేదిక, వేల సంఖ్యలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, ప్రాంగణమంతా నేలపై ఆకుపచ్చ తివాచీలు, వేదిక వరకు సీఎం కారు వెళ్లే మార్గంలోనూ కార్పెట్లు ఇలా ఎక్కడ చూసినా ఆడంబరం ఉట్టిపడేలా మేదరమెట్ల సిద్ధం సభ నిర్వహించారు. అంతకుముందు మూడు సిద్ధం సభలూ అదే స్థాయిలో జరిగాయి.

బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు

సిద్ధం సభలతో సీఎం కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. జనం మధ్యకు ర్యాంప్‌ వాక్‌ చేస్తున్నారు. మొదటి సభకు శిలువ ఆకారంలో ర్యాంప్‌ వాక్‌ వేదికను ఏర్పాటు చేశారు. దానిపై విమర్శలు రావడంతో ఇప్పుడు ఇంగ్లిషు అక్షరం 'వై' ఆకారంలోకి దాన్ని మార్చారు. మేదరమెట్ల సిద్ధం సభకు ప్రాంగణమంతా గ్రీన్‌ మ్యాట్‌ పరిచారు. ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలో ఈ గ్రీన్‌ మ్యాట్‌ టెక్నిక్‌ను వాడుతున్నారు. గ్రీన్‌ మ్యాట్‌ ఉంచి స్టూడియోలోనే దృశ్యాలు చిత్రీకరిస్తారు. తర్వాత పర్వతాలు, జలపాతాలు వంటివి ఉన్నట్లుగా గ్రాఫిక్స్‌లో జతచేస్తారు. ఒక రాజకీయ పార్టీ సభకు గ్రీన్‌ మ్యాట్‌లు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.

సిద్ధం సభల కోసం వైసీపీ పదే పదే తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. వైసీపీ అనుబంధ విభాగాలుగా మారిపోయిన పోలీసు, ఆర్టీసీ తదితర విభాగాలు ఎక్కడలేని ప్రభుభక్తినీ ప్రదర్శిస్తూ సిద్ధం సభలకు ఏర్పాట్లలో తలమునకలవుతున్నాయి. వైసీపీ సభలు జరుగుతున్నాయంటే చాలు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు జీ హుజూర్‌ అంటూ ఎన్ని వేల బస్సులు కావాలంటే అన్నీ సమకూరుస్తున్నారు. వైసీపీ ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు సభలకు ఆర్టీసీ బస్సులకే సుమారు 22.50 కోట్లు ఖర్చు చేసింది.

850 బస్సులతో భీమిలి సభకు 3 కోట్లు , 1,350 బస్సులతో దెందులూరు సభకు 4.5 కోట్లు, 3 వేల బస్సులతో రాప్తాడు సభకు 8 కోట్లు, 3 వేల 500ల బస్సులతో మేదరమెట్ల సభకు 7 కోట్లు వెచ్చించింది. ప్రైవేటు బస్సులు, విద్యా సంస్థల బస్సులు మరికొన్ని వేలల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం విద్యా సంస్థల బస్సుల్ని వాటికి అనుమతిచ్చిన మార్గాల్లో మాత్రమే నడపాలి. విద్యార్థుల్ని వారి ఇళ్ల నుంచి స్కూల్‌కి తీసుకొచ్చేందుకు, మళ్లీ ఇళ్ల వద్ద దింపేందుకు మాత్రమే వినియోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి, సీఎం జగన్‌ పాల్గొంటున్న సభలకు భారీ సంఖ్యలో స్కూల్‌ బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు.

సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల

సిద్ధం సభకు బందోబస్తు కోసం భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో శని, ఆదివారాల్లో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని పోలీసు స్టేషన్లన్నీ బోసిపోయాయి. ప్రకాశం జిల్లాలో 41 పోలీసు స్టేషన్లలో మొత్తం 1,770 మంది పనిచేస్తుండగా వారిలో 1,250 మందిని సిద్ధం సభ కోసం వినియోగించారు. బాపట్ల జిల్లాలో మొత్తం 1,300 మంది పోలీసు సిబ్బంది ఉండగా, వారిలో 900 మందిని భద్రతా ఏర్పాట్ల కోసం పంపించారు. వాలంటీర్లు, కొందరు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అయితే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ సిద్ధం సభలకు జనాన్ని తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. డబ్బు వారే పంచుతున్నారు. సభకు రాకపోతే పథకాలు నిలిపివేస్తారన్న హెచ్చరికలూ జారీ చేస్తున్నారు.

సిద్ధం సభలకు తరలించే జనాలకు వైసీపీ నాయకులు సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. పురుషులకు రోజుకు దూరాన్ని బట్టి 500 నుంచి 1,000 రూపాయల వరకు నగదు, బిర్యానీ, హాఫ్‌బాటిల్‌ మద్యం, దూర ప్రాంతాలవారికైతే మూడు పూటలా భోజనం, అవసరమైతే రాత్రిపూట బస చేయడానికి వసతి కల్పిస్తున్నారు. మహిళలకు నగదు, బిర్యానీ ఇస్తున్నారు. కొందరైతే ఇతర కానుకలూ సమకూరుస్తున్నారు. ఆదివారం సిద్ధం సభకు వచ్చిన కొన్ని బస్సులు 'సంచార మద్యం శాలలు'గా కనిపించాయి.

వాటిలోని మందు బాబులు సీసాలు ఎత్తిపెట్టి మద్యం తాగుతూ కేరింతలు కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఇలా సకల సౌకర్యాలూ కల్పించి జనాన్ని సభలకు తరలించేందుకు చాలా ఖర్చువుతుంది. ఎక్కడి పార్వతీపురం, ఎక్కడ మేదరమెట్ల సుదూర ప్రాంతాల నుంచి ఒక బస్సులో జనాన్ని తరలించాలంటే రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఖర్చవుతుంది. ఎన్నికల సమయంలో జరిగే ఇలాంటి సభలకు అయ్యే ఖర్చును స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులనే పెట్టుకోమనేవారు. కానీ వైసీపీ సభలకు చాలా వరకు ఖర్చు పార్టీనే భరిస్తున్నట్లు సమాచారం. అంత డబ్బు పార్టీకి ఎక్కడి నుంచి వచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.