CM Jagan Interaction With YCP Social Media Activists : సీఎం జగన్ సిద్ధం అంటూ యుద్దానికి దిగినట్లు బస్సు యాత్రలు చేస్తుంటే ఆయన తరపున సోషల్ మీడియా విభాగం మీమంతా సిద్ధం అంటూ పోరాడుతోంది. అలాంటి సోషల్ మీడియా వింగ్‌తో నేడు సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగాలి తదితర అంశాలపై వారితో చర్చించారు. పార్టీ గెలుపు కోసం అలుపెరుగక కృషి చేస్తున్న వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెషన్ హాలులో వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో సీఎం జగన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు.
CM Jagan Interaction With Social media representatives : ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం వారి అభిప్రాయాల్ని చెప్పాలని సీఎం జగన్ కోరగా, ఓ యువతి స్పందిస్తూ, తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే అభిమానం అని, తాను సీఎం జగన్‌లా ఓ పారిశ్రామిక వేత్తగా ఎదగాలనుకుంటున్నానని తెలిపింది. అంతటితో ఆగకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్న వారికి ఎవైనా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది. సీఎం జగన్ రాజకీయాలు, వ్యాపారాలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించింది.
బిక్కమొఖం వేస్తూ దిక్కులు చూసిన సీఎం జగన్ : అయితే, ఆ యువతి అడిగి ప్రశ్నకు సీఎం జగన్ బిక్కమెుఖం వేస్తూ దిక్కులు చూశారు. ప్రశ్న అర్థం కాలేదన్నట్లు అటూ ఇటూ చూశాడు. ఆ యువతి మళ్లీ అదే ప్రశ్న అడగడంతో సీఎం తెల్లముఖం వేశాడు. అది గమనించిన సజ్జల భార్గవ్ స్పందిస్తూ, సీఎం జీవితంపై అంతర్జాలంలో సమాచారం ఉంటుందని, అక్కడ పూర్తి వివరాలు తెలుస్తాయని సమాధానంతో దాటవేసే ప్రయత్నం చేశారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగింది.
ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి - CM JAGAN INTERACT WITH PUBLIC
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'
టిక్కెట్ ఎవరికి దక్కే'నో' ? - సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చర్చోపచర్చలు