ETV Bharat / politics

ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు - CM Chandrababu Tour

CM Chandrababu Tour in Prakasam District: రాష్ట్రంలో జగన్‌ పర్యటించాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీన 'పేదల సేవలో' కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

cm_chandrababu_tour
cm_chandrababu_tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 5:28 PM IST

Updated : Sep 20, 2024, 10:02 PM IST

CM Chandrababu Tour in Prakasam District: ప్రతి నెల 1వ తేదీన 'పేదల సేవలో' కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తీర్చాలని సూచించారు. 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం పర్యటించారు. పర్యటనలో భాగంగా మద్దిరాలపాడు ఆంజనేయస్వామిని సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, తదితరులు పాల్గొన్నారు.

ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు (ETV Bharat)

రాష్ట్రంలో జగన్‌ పర్యటించాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ మీటింగ్​లకు డ్వాక్రా సంఘాల మహిళలను లాక్కుని వచ్చేవారని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలు రాకపోతే పింఛన్‌, రేషన్‌ కోత విధించే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. వైఎస్సార్​సీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి విజయం కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ అందిస్తున్నామని సీఎం వివరించారు.

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది - నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు? : టీటీడీ ఈవో - TTD EO on Laddu Controversy

గతంలో పింఛన్లు అస్తవ్యస్తంగా పంపిణీ చేశారని, దివ్యాంగులు కాకపోయినా పింఛన్లు ఇచ్చారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గ్రామసభ ఏర్పాటు చేసి అర్హులకు పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.. అక్టోబర్‌ నెలంతా గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు అందుతాయని తెలిపారు. దివ్యాంగులు కాకపోయినా ధ్రువపత్రం ఇస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. పేదల పట్ల ఉదారంగా ఉంటా తప్పులు చేస్తే వదిలిపెట్టనని సీఎం అన్నారు.

ఎదురుదాడి చేస్తే తాటతీస్తా: గత సీఎం శిష్యులకు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనం ఉందని ఎదురుదాడి చేస్తే భయపడతారు అని అనుకుంటున్నారని అన్నారు. కానీ ఎదురుదాడి చేస్తే భయపడను తాటతీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామని మమ్మల్ని గెలిపించారని సీఎం అన్నారు. మీ అభిమానాన్ని నా జీవితంలో ఎప్పుడూ మరవనని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం భవిష్యత్తు బాగుండాలని కూటమికి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. 100 రోజుల్లో అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌ -‘శ్రీవారి ఫొటోలను తొలగించేందుకు జగన్‌ అండ్‌ కో యత్నం’: కేంద్ర మంత్రి తీవ్ర ఆరోపణలు - Union Ministers on Tirumala Laddu

Last Updated : Sep 20, 2024, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.