ETV Bharat / politics

దేవేంద్ర ఫడణవీస్‌ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు - CM CHANDRABABU TO MUMBAI

ఆజాద్‌ మైదానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం

cm_chandrababu_to_mumbai_for_fadnavis_cm_oath_ceremony
cm_chandrababu_to_mumbai_for_fadnavis_cm_oath_ceremony (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 2:13 PM IST

CM Chandrababu To Mumbai For Fadnavis CM Oath Ceremony : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు(గురువారం) ముంబయి వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయి బయలుదేరుతారు. ఆ తర్వాత ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

రాత్రి 7.30 గంటల సమయంలో అక్కడ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రాత్రికి జిల్లా పార్టీ కార్యాలయంలో బస చేస్తారు. రేపు విశాఖలో ‘డీప్‌టెక్‌’ సదస్సులో పాల్గొంటారని సమాచారం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న దేవేంద్ర ఫడణవీస్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఫడణవీస్‌ నాయకత్వం మహారాష్ట్ర అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేరుస్తుందని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఫడణవీస్ డైనమిక్ నాయకత్వం మహారాష్ట్రను కొత్త శిఖరాల వైపు నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఫడణవీస్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోతున్న పవన్శు భాకాంక్షల సందేశాన్ని పంపారు. కుమారుడి విద్యాసంస్థలో కార్యక్రమం కోసం పవన్ సింగపూర్‌ వెళ్తున్నారు.

ఏపీలో జనాభా పెంచేందుకు కృషి - జపాన్, చైనా, ఆస్ట్రేలియా విధానాల పరిశీలన

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్- వీడిన ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.