ETV Bharat / politics

కాంగ్రెస్​ - బీఆర్​ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం ​- జనగామలో ఉద్రిక్తత - Leaders Clash in Polling Booth - LEADERS CLASH IN POLLING BOOTH

Clashes in Polling Centre : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ వేళ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జనగామలో పోలింగ్​ కేంద్రం వద్ద కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి సురేశ్​​ షెట్కార్ సోదరుడు, బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. మరోవైపు పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్​ ఆలస్యంగా జరిగింది.

Leaders Clashes at Polling Centres in Telangana
Clashes in Polling Centre (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 3:53 PM IST

Updated : May 13, 2024, 4:03 PM IST

Leaders Clashes at Polling Centres in Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో​ జరగగా, కొన్నిచోట్ల మాత్రం రాజకీయ నేతలు ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారంటూ పలు పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. జనగామలో ఉద్రిక్తత నెలకొంది. ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సరళిని పరిశీలించేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని బీఆర్​ఎస్​ నేతలు అడ్డుకున్నారు.

కాంగ్రెస్​ నేత పోలింగ్‌ బూత్‌ వద్దకు రావడంపై బీఆర్​ఎస్​ ఏజెంట్‌ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Clash Between Congress And BJP In Narayankhed : మరోవైపు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎన్నికల పోలింగ్ కోసం ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై జహీరాబాద్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్ సోదరుడు నగేశ్​ షెట్కార్ దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. పలుచోట్ల ఈవీఎంలు కూడా మొరాయించాయి. దీంతో పోలింగ్​ అరగంట పాటు ఆలస్యంగా జరిగింది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా లేక చీకటి గదుల్లోనే పోలింగ్​ ప్రక్రియ కొనసాగించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి, గాలులకు కరెంట్​ నిలిపోయిందని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్​ - బీఆర్​ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం ​- జనగామలో ఉద్రిక్తత (ETV Bharat)

ఏపీ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు - ఏకంగా ఏజెంట్లనే కిడ్నాప్​ చేసిన వైఎస్సాఆర్సీపీ నేతలు - POLLING AGENTS KIDNAPPED IN AP

వంతెన కావాలని - మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని - పలు ప్రాంతాల్లో ఎన్నికల బహిష్కరణ - TS LOK SABHA ELECTIONS BOYCOTT 2024

Last Updated : May 13, 2024, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.